Motorola One Fusion+ sale: ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటో ఇండియా గత నెలలో మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోటరోలా వన్ ఫ్యూజన్ + ను ఇండియాలో విడుదల చేసింది. లాక్ డౌన్ కారణంగా కేవలం ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే లభించే ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ యొక్క చివరి రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి అద్భుతమైన ఆఫర్లతో ప్రారంభం కానున్నాయి.

 

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఇండియాలో కేవలం ఓకే ఒక వేరియంట్ లలో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 17,999 రూపాయలు. ఇది ట్విలైట్ బ్లూ మరియు మూన్లైట్ వైట్ అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.  

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + సేల్స్ ఆఫర్స్

మోటరోలా స్మార్ట్‌ఫోన్లలో మిడ్-రేంజ్ లైనప్ లో విడుదలైన మోటరోలా వన్ ఫ్యూజన్+ ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో కొన్ని అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం గూగుల్ నెస్ట్ మినీ చార్‌కోల్‌ను రూ.1,999 ధర వద్దనే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్
 

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతుంది. దీని యొక్క 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి మరియు 395ppi పిక్సెల్ సాంద్రతతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని పొందుతూ అడ్రినో 618 GPU మరియు 6GB RAM తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + క్వాడ్ కెమెరా సెటప్‌

మోటరోలా వన్ ఫ్యూజన్ + క్వాడ్ కెమెరా సెటప్‌

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో నిలువ వరుసలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో , 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Motorola One Fusion+ Goes Flash Sale on Flipkart Big Saving Days Sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X