మోటరోలా నుంచి Android One స్మార్ట్‌ఫోన్,ఐఫోన్ ఫీచర్‍తో..!

|

కొద్ది రోజుల క్రితమే మోటో జీ6, మోటో ఇ5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన మోటరోలా మరో విప్లవాత్మక ఆవిష్కరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రివీల్ అయిన మరో న్యూస్ ప్రకారం 'మోటరోలా వన్ పవర్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలియవచ్చింది. ఐఫోన్ ఎక్స్ తరహా నాట్జ్ డిజైన్ ఈ మోటో హ్యాండ్‌సెట్‌కు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలవనుందట. గతంలో మోటో ఎక్స్4 పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా, యూఎస్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ మోడల్ ఆ ఒక్క ప్రాంతానికే పరిమితమవటంతో అంతగా ప్రస్తావన లేకుండా పోయింది. తాజాగా డిజైన్ చేస్తోన్న ఆండ్రాయిడ్ వన్ మోడల్ మోటో ఎక్స్4లా కాకుండా అన్ని ప్రధాన మార్కెట్లలో లభ్యం కానుందట.

 

మోటో కొత్త ఫోన్లు ఇండియాకి వచ్చేశాయ్, అదిరే ఫీచర్లు, బడ్జెట్ ధరమోటో కొత్త ఫోన్లు ఇండియాకి వచ్చేశాయ్, అదిరే ఫీచర్లు, బడ్జెట్ ధర

మోటరోలా వన్ పవర్

మోటరోలా వన్ పవర్

మోటరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ ఫోటోను కూడా ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ లీక్ చేసింది. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే ‘మోటరోలా వన్ పవర్' స్మార్ట్‌ఫోన్ పూర్తిస్థాయి ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లేతో రాబోతోంది. ఇదే సమయంలో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ను కూడా ఈ డివైస్.

Android One అంటే ఏంటి..?

Android One అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ కంనీ సీఈఓ సుందర్ పిచాయ్ 2014లో లాంచ్ చేసారు. రూ.6000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో కూడా క్వాలిటీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయాలన్నది ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం రూపొందించబడిన రిఫరెన్స్ హార్డ్‌వేర్ డిజైన్‌ను కూడా గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రొవైడ్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయని గూగుల్ తెలిపింది.

భారత్‌లో నిరాశపరిచిన ప్రాజెక్ట్...
 

భారత్‌లో నిరాశపరిచిన ప్రాజెక్ట్...

భారత్‌లో ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి లోకల్ బ్రాండ్‌లు సెప్టంబర్ 2014లో లాంచ్ చేసాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు సుందర్ పిచాయ్ తెలపటంతో ఈ ప్లాట్ ఫామ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, ఫిలిప్పిన్స్, బాంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గూగల్ లాంచ్ చేసింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఆండ్రాయిడ్ వన్ ఆకట్టుకోలేకపోవటంతో ఈ ప్రాజెక్టును గూగుల్ కొంతకాలం పక్కనపెట్టింది. ఇటీవీల షియోమి ఎంఐ ఏ1 మోడల్‌తో గూగుల్ తన ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను మరోసారి రంగంలోకి దింపింది.

ఆండ్రాయిడ్ వన్‌కి ఆండ్రాయిడ్‌కి మధ్య తేడాలేంటి..?

ఆండ్రాయిడ్ వన్‌కి ఆండ్రాయిడ్‌కి మధ్య తేడాలేంటి..?

ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్. ఈ ఆపరేటింగ్ సిస్టంను OEMs అలానే తయారీదారులు తమకు నచ్చినట్లుగా మార్చుకునే వీలుంటుంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం బాగా హెవీగా అనిపిస్తుంది. ఓఎస్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అలానే సెక్యూరిటీల అప్‌డేట్‌లను OEMs రెగ్యులేట్ చేస్తుంటాయి. ఈ విషయంలో గూగుల్ పాత్ర కొద్దిగానే ఉంటుంది.

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌

ఇక ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి. వీటి గూగుల్ నుంచి రెగ్యలర్ అప్‌డేట్స్ లభిస్తుంటాయి. ఓఎస్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అలానే సెక్యూరిటీల అప్‌డేట్‌లతో OEMsకు ప్రెమేయం ఉండదు.

Best Mobiles in India

English summary
After unveiling the Moto G6 and Moto E5 series this year, Motorola is in the midst of rumours of the Moto Z3 Play. Now, the Lenovo-owned company is in the headlines for building an Android One smartphone that could debut as "Motorola One Power".

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X