Home
Mobile

అదిరిపోయే ఫీచర్స్ తో నేడు మార్కెట్లోకి లాంచ్ కానున్న Motorola One Power ఫోన్

దిగ్గజ మొబైల్ సంస్థ లెనోవొ మోటోరోలా తన తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ Motorola One Power ను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.

దిగ్గజ మొబైల్ సంస్థ లెనోవొ మోటోరోలా తన తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ Motorola One Power ను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:00 pm కి ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ జరగనుంది. Motorola One Power స్మార్ట్‌ఫోన్‌ను తొలత బెర్లిన్ వేదికగా జరిగిన ఐఎఫ్ఏ 2018లో భాగంగా మోటరోలా పరిచయం చేసింది. మోటో లైనప్ ఫోన్‌లకు భిన్నంగా కొత్త లుక్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌‌లుక్‌లోనే అందరిని ఆకట్టుకుంది.ఇందులో 6.2 ఇంచ్ మ్యాక్స్ విజన్ 19:9 డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఈ Motorola One Power ఫోన్ ధర సుమారు రూ. 14,000 వరకు ఉండే అవకాశం ఉంది.ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

ధర..

ధర..

ఇండియన్ మార్కెట్లో Motorola One Power ధర సుమారు రూ.14,000 వరకు ఉండే అవకాశం ఉంది . Asus ZenFone Max Pro M1, Xiaomi Redmi 6 Pro, Xiaomi Redmi Note 5 Pro మరియు Nokia 6.1 Plus డివైస్‌లకు ఈ ఫోన్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

స్నాప్‌డ్రాగన్ 636 సాక్..

స్నాప్‌డ్రాగన్ 636 సాక్..

Motorola One Power స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 6.2 ఇంచ్ మ్యాక్స్ విజన్ 19:9 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా త్వరలో ఆండ్రాయిడ్ ‘పై' అప్‌డేట్ లభించబోతోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్ పై రన్ అవుతుంది.

నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొదటి మోటరోలా ఫోన్...

నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొదటి మోటరోలా ఫోన్...

మోటరోలా నుంచి నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే కావటం విశషం. Motorola One Power స్మార్ట్‌ఫోన్‌ను తొలత బెర్లిన్ వేదికగా జరిగిన ఐఎఫ్ఏ 2018లో భాగంగా మోటరోలా పరిచయం చేసింది. మోటో లైనప్ ఫోన్‌లకు భిన్నంగా కొత్త లుక్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌‌లుక్‌లోనే అందరిని ఆకట్టుకుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్...

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్...

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

 

 

డ్యుయల్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..

డ్యుయల్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..

ఇక కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వ్యవస్థలనను మోటరోలా ఏర్పాటు చేసింది. శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్పెక్స్‌ ఈ డివైస్‌లో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Motorola One Power India Launch Set for Today.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X