మొదటిసారి సేల్ కి వచ్చిన మోటోరోలా వన్ పవర్ మొబైల్ ధర ఎంతంటే ?
లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ మోటరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఈ రోజు మొదటి సారి సేల్ కి రానుంది.
లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ మోటరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఈ రోజు మొదటి సారి సేల్ కి రానుంది.ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు . రూ.15,999 ధరతో లభించే ఈ మోటోరోలా వన్ పవర్ ఫోన్ వివో వీ11 ప్రో, పోకో ఎఫ్1, షియోమి ఎంఐ ఏ2 డివైస్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొదటి మోటరోలా ఫోన్...
మోటరోలా నుంచి నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే కావటం విశషం. మోటరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్‌ను తొలత బెర్లిన్ వేదికగా జరిగిన ఐఎఫ్ఏ 2018లో భాగంగా మోటరోలా పరిచయం చేసింది. మోటో లైనప్ ఫోన్‌లకు భిన్నంగా కొత్త లుక్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటిలుక్‌లోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 636 సాక్..
మోటరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 6.2 ఇంచ్ మ్యాక్స్ విజన్ 19:9 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా త్వరలో ఆండ్రాయిడ్ ‘పై' అప్‌డేట్ లభించబోతోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్ పై రన్ అవుతుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్...
ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్ మోడల్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

డ్యుయల్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..
ఇక కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వ్యవస్థలనను మోటరోలా ఏర్పాటు చేసింది. శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్పెక్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ వన్ అంటే?
ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ 2014లో లాంచ్ చేసారు. రూ.6000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో కూడా క్వాలిటీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయాలన్నది ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం రూపొందించబడిన రిఫరెన్స్ హార్డ్‌వేర్ డిజైన్‌ను కూడా గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రొవైడ్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయని గూగుల్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








