Mi A2కు పోటీగా Motorola కొత్త ఫోన్, సెప్టంబర్ 24న మార్కెట్లోకి..

లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

|

లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మోటరోలా వన్ పవర్ (Motorola One Power) పేరుతో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్ 24న అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఐఫోన్ యూజర్లకి షాకిచ్చిన వాట్సప్, వాటికి పనిచేయదటఐఫోన్ యూజర్లకి షాకిచ్చిన వాట్సప్, వాటికి పనిచేయదట

నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొదటి మోటరోలా ఫోన్

నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొదటి మోటరోలా ఫోన్

మోటరోలా నుంచి నాట్జ్ డిస్‌ప్లేతో వస్తోన్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే కావటం విశషం. మోటరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్‌ను తొలత బెర్లిన్ వేదికగా జరిగిన ఐఎఫ్ఏ 2018లో భాగంగా మోటరోలా పరిచయం చేసింది. మోటో లైనప్ ఫోన్‌లకు భిన్నంగా కొత్త లుక్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌‌లుక్‌లోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 636 సాక్..

స్నాప్‌డ్రాగన్ 636 సాక్..

మోటరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 6.2 ఇంచ్ మ్యాక్స్ విజన్ 19:9 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ డివైస్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా త్వరలో ఆండ్రాయిడ్ ‘పై' అప్‌డేట్ లభించబోతోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్ పై రన్ అవుతుంది.

 

 

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్...
 

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్...

ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరజ్, 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్స్ల్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 3జీబి/32జీబి, 4జీబి/64జీబి మోడల్స్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

 

 

 

డ్యుయల్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..

డ్యుయల్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ..

ఇక కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వ్యవస్థలనను మోటరోలా ఏర్పాటు చేసింది. శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి స్పెక్స్‌ ఈ డివైస్‌లో ఉన్నాయి. మార్కెట్లో మోటో వన్ పవర్ ధర రూ.25,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. వివో వీ11 ప్రో, పోకో ఎఫ్1, షావోమి ఎంఐ ఏ2 డివైస్‌ల నుంచి ఈ ఫోన్‌కు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

 

 

ఆండ్రాయిడ్ వన్ అంటే?

ఆండ్రాయిడ్ వన్ అంటే?

ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ కంనీ సీఈఓ సుందర్ పిచాయ్ 2014లో లాంచ్ చేసారు. రూ.6000లోపు స్మార్ట్‌ఫోన్‌లలో కూడా క్వాలిటీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయాలన్నది ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల కోసం రూపొందించబడిన రిఫరెన్స్ హార్డ్‌వేర్ డిజైన్‌ను కూడా గూగుల్, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రొవైడ్ చేసింది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయని గూగుల్ చెబుతోంది.

 

 

Mi A1తో తిరిగి ఫామ్‌లోకి..

Mi A1తో తిరిగి ఫామ్‌లోకి..

భారత్‌లో ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి లోకల్ బ్రాండ్‌లు సెప్టంబర్ 2014లో లాంచ్ చేసాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు సుందర్ పిచాయ్ తెలపటంతో ఈ ప్లాట్‌ఫామ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, ఫిలిప్పిన్స్, బాంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా గూగల్ లాంచ్ చేసింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఆండ్రాయిడ్ వన్ ఆకట్టుకోలేకపోవటంతో ఈ ప్రాజెక్టును గూగుల్ కొంతకాలం పక్కనపెట్టింది. షావోమి Mi A1తో గూగుల్ తన ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫామ్‌ను మరోసారి రంగంలోకి దింపింది. అప్పటి నుంచి ఈ ఫ్లాట్‌ఫామ్ వెనక్కితిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది.

Best Mobiles in India

English summary
Motorola One Power with notch screen, Android One to launch on September 24.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X