మోటో ఇ (సెకండ్ జనరేషన్)ను ప్రకటించిన మోటరోలా

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ మోటరోలా, మోటో ఇ (సెకండ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. 3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ ఇంకా ఆసియా దేశాల్లో ఈ ఫోన్‌లను త్వరలో విక్రయించనున్నారు.

మోటో ఇ (సెకండ్ జనరేషన్)ను ప్రకటించిన మోటరోలా

మోటో ఇ (సెకండ జనరేషన్) 4జీ ఎల్టీఈ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, ధర 149.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.9,300).

మోటో ఇ (సెకండ్ జనరేషన్)ను ప్రకటించిన మోటరోలా

మోటో ఇ (సెకండ జనరేషన్) 3జీ వర్షన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 400 మెగాహెర్ట్జ్ అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.0లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై 80.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 145 గ్రాములు, చుట్టుకొలతలు 66.8×129.9×5.2 - 12.3 మిల్లీ మీటర్లు, ధర 119.99 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.7,430).

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

భారత్‌లో మోటో ఇ (సెకండ జనరేషన్) ఫోన్‌లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ అందుబాటుకు సంబంధించి కచ్చితమైన సమాచారం వెలువడాల్సి ఉంది.

English summary
Motorola Outs Moto E (Gen 2) With a Bigger Screen, LTE and Android Lollipop. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting