Home
Mobile

త్వరలో రూ.3,100కే మోటరోలా స్మార్ట్‌ఫోన్..?

2013లో తన భారత పర్యటనలో భాగంగా గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ వెబ్ బ్రౌజింగ్‌ను అమితంగా ఇష్టపడుతున్న భారతీయులకు వెబ్ బ్రౌజర్ ఇంకా వెబ్- క్లయింట్ అప్లికేషన్‌లతో కూడిన ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లు 50 డాలర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు త్వరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్న నేపధ్యంలో మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.

త్వరలో రూ.3,100కే మోటరోలా స్మార్ట్‌ఫోన్..?

మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలాను గూగుల్ సొంతం చేసుకున్న నేపధ్యంలో 50 డాలర్ల పోన్ తయారీ పై వ్యూహరచన జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 50 డాలర్లంటే ప్రస్తుత ఇండియన్ కరెన్స్ ప్రకారం రూ.3,100. ఈ సమచారాన్ని మోటరోలా సీఈఓ డెన్నిస్ వుడ్సైడ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని డెన్నిస్ వెల్లడించలేదట. ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశం పై కూడా స్ఫష్టత లేదు. అయితే, భవిష్యత్ కాలంలో మోటరోలా నుంచి చవక ధర స్మార్ట్‌ఫోన్‌ను ఆశించవచ్చన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా అందుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఇదిలా ఉండగా, మోటరోలా కంపెనీ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడింది. ‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నట్లు మోటరోలా ఇండియా తన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లలో పేర్కొంది.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా నవంబర్ 2013లో ప్రకటించారు. ఆ తరువాత ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ విడుదలకు సంబంధించి అనేక పుకార్లు షికార్లు చేసాయి. ‘మోటో జీ' ఆవిష్కరణ జనవరిలోనే ఉంటుందని అభిమానులు అనుకున్నారు. అయితే, ఫోన్ విడుదల తేదీ కాస్తా ఫిబ్రవరి 5కు చేరింది.

మోటరోలా ‘మోటో జీ' కీలక స్పెసిఫికేషన్లు:

4.5 అంగుళాల ప్రకాశవంతమైన ఇంకా స్పష్టమైన ఎల్సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720 పిక్సల్స్, 329 పీపీఐ), సింగిల్ సిమ్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 8జీబి వేరియంట్, 16జీబి వేరియంట్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ. అనధికారికంగా అందుతున్న వివరాల మేరకు మోటో జీ స్మార్ట్‌ఫోన్ 8జీబి వర్షన్ ధర రూ.13,000, 16జీబి వర్షన్ ధర రూ.16,000గా ఉండొచ్చని అంచనా.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X