మోటరోలా కొత్త ఫోన్ రూ.10,000లోపే!

Posted By:

న్యూఢిల్లీ ఇంకా లండన్ నగరాలను వేదికగా చేసుకుని ఈ నెల 13వ తేదీన మోటరోలా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ వేదిక పై మోటరోలా ‘మోటో ఇ' పేరుతో చవక స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించబోతోంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అన్ని టాక్స్ లు కలుపుకుని రూ.10,000లోపు ఉండొచ్చని ఓ ప్రముఖ డేటాబేస్ వెల్లడించింది. మోటరోలా మోటో ఇ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

 మోటరోలా కొత్త ఫోన్ రూ.10,000లోపే!

సింగిల్ సిమ్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్,
4.3 అంగుళాల తాకేతెర (720 పిక్సల్ డిస్‌ప్లే),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లాక్ కలర్ వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting