6.9 అంగుళాల డిస్‌ప్లే, 32MP సెల్ఫీ కెమెరాతో మోటోరోలా ఫ్లిప్ ఫోన్ విడుదల.. రేపటి నుంచి ముందస్తు బుకింగ్‌లు..!
మోటోరోలా సంస్థ ఇవాళ ఫ్లిప్ మోడల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ అల్యూమినియం ఫేమ్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ జూన్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. అయితే భారత్ వేరియంట్ 6.9 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 3.63 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. రేపటి నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 20 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా సహా అమెజాన్, రిలయన్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల FHD+ pOLED ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2640 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 413ppi పిక్సల్ డెన్సిటీతో విడుదల అంది.

దీంతోపాటు ఈ ఫ్లిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ 3.63 అంగుళాల FHD+ pOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 1056*1066 పిక్సల్ రిజల్యూషన్‌తో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది. మరియు వెనుకవైపు వేగాన్ లెదర్ ఫినిష్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.
మోటోరోలా Razr 50 హ్యాండ్‌సెట్ మీడియాటెక్ 7300X చిప్‌సెట్ (Under the hood) పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UX OS ను కలిగి ఉంటుంది. 3 సంవత్సరాలపాటు OS, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని మోటోరోలా తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే ఇన్నర్ డిస్‌ప్లేలో 32MP కెమెరాను అమర్చారు. 33W వైర్, 15W వైర్‌లెస్ సపోర్టుతో 4200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, GPS, బ్లూటూత్ 5.4, వైఫై 802.11, FM రేడియో, A GPS, Glonass, QZSS, LTEPP, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సిలిరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్. ఇ-కాంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది.

భద్రత కోసం ఈ మోటోరోలా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది. IPX8 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ 188.4 గ్రాముల బరువు ఉంది.
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ (Motorola Razr 50 Smartphone) ప్రారంభ ధర రూ.64999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ముందస్తు బుకింగ్‌లు రేపటి (సెప్టెంబర్ 10) నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ (Motorola.in), అమెజాన్, రిలయన్స్ డిజిటల్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. బీచ్ శాండ్, కోలా గ్రే, స్ప్రిట్జ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది.
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో రూ.10,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫ్లిప్ ఫోన్ ప్రారంభ ధర రూ.49,999 గా ఉంటుంది. రిలయన్స్ జియో ద్వారా రూ.15000 వరకు ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ తెలిపింది. EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications