మోటోరోలా నుంచి మరో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ వెల్లడి.. జెమిని AI, Moto AI ఫీచర్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి త్వరలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇవాళ మోటోరోలా సంస్థ కీలక ప్రకటన చేసింది. మోటోరోలా Razr 50 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను (Motorola Razr 50 Smartphone Launch date) సెప్టెంబర్ 9 న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. మోటోరోలా రేజర్ 50 స్మార్ట్‌ఫోన్ గురించి సంస్థ ఇప్పటికే అనేక టీజర్‌లను విడుదల చేసింది.
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం (Motorola Upcoming Smartphone) అమెజాన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కోసం ప్రత్యేక పేజీని పబ్లిష్ చేసింది. ఈ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

భారీ కవర్ డిస్‌ప్లే! :
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల సెగ్మెంట్‌లోనే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ కోటింగ్ మరియు IPX8 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌తో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ జెమిని, మోటో AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనా, అమెరికాలో అందుబాటులో ఉంది. భారత్ వేరియంట్ కూడా అదే తరహా స్పెసిఫికేషన్‌లు, ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.
మోటోరోలా Razr 50 స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల FHD+ pOLED ఇన్నర్ డిస్‌ప్లే, 3.6 అంగుళాల FHD+ pOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. చూడగానే ఆకట్టుకొనే తరహాలో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300X చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. 30W వైరడ్, 15 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4200mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ఔటర్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా సహా 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో విడుదల కానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో రానుంది. స్టోరేజీ సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








