Home
Mobile

మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది.. రూ.15,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ఇటీవల మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం అయింది. ఈ మోటోరోలా ఫ్లిప్‌ మోడల్‌ హ్యాండ్‌సెట్‌ను సుమారుగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మోటోరోలా ఇండియా, అమెజాన్‌, రిలయన్స్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల ఇన్నర్‌ డిస్‌ప్లే, 3.63 అంగుళాల కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

మోటోరోలా Razr 50 స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ ల వివరాలు :
మోటోరోలా ఫ్లిప్‌ మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ (Motorola Razr 50 Smartphone) 6.9 అంగుళాల FHD + (1080*2640 పిక్సల్‌ రిజల్యూషన్‌) pOLED ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Motorola Razr 50 Smartphone sale

ఈ డిస్‌ప్లే 120Hz రీప్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 413ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 3.63 అంగుళాల (1056*1066 పిక్సల్‌ రిజ‌ల్యూషన్‌) FHD+ pOLED కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UX OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ 7300X చిప్‌సెట్‌ (అండర్‌ ది హుడ్‌) పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 సంవత్సరాలపాటు OS, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని మోటోరోలా సంస్థ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఇన్నర్‌ డిస్‌ప్లేలో 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ మోటోరోలో Razr 50 స్మార్ట్‌ఫోన్ 33W వైర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 4200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌, అల్యూమినియం ఫ్రేమ్‌ ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. మరియు IPX8 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు ఈ ఫ్లిప్‌ మోడల్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ పరంగా మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్‌ 5G, వైఫై 802.11, GPS, బ్లూటూత్‌ 5.4, FM రేడియో, A GPS, Glonass, QZSS, LTEPP, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సిలిరో మీటర్‌, సెన్సార్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, బారోమీటర్‌. ఇ-కాంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది.

మోటోరోలా Razr 50 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.64,999 గా ఉంది. అమెజాన్‌లో ప్రారంభ ఆఫర్‌లో భాగంగా కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎంపిక చేసిన ‌బ్యాంకు కార్డుల ద్వారా రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.49,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. బీచ్‌ శాండ్‌, కోలా గ్రే, స్ప్రిట్జ్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Razr 50 Smartphone sale is live on amazon specs features price full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X