Home
Mobile

6.9 అంగుళాల డిస్‌ప్లేతో మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్‌..?

మోటోరోలా నుంచి త్వరలో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. మోటోరోలా నుంచి గతంలో రేజర్‌ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. రేజర్‌ 50 అల్ట్రా మోడల్‌ ఇటీవల బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ వెబ్‌సైట్‌ సహా EEC లో కనిపించింది. ఫలితంగా భారత్‌ లోనూ విడుదల కానుందని స్పష్టమైంది.

ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. ఇటాలియన్‌ రిటైలర్‌ నుంచి లీక్‌ అయిన సమాచారం ఆధారంగా మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ (Motorola Razr 50 Ultra Smartphone) 12GB ర్యామ్‌, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర €1200 గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం రూ.1,07,634 గా ఉంది.

Motorola Razr 50 Ultra smartphone specs and price leaked

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి. లీకైన ఫోటోల ఆధారంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు పంచ్‌హోల్‌ ను సెల్ఫీ కెమెరా కోసం వినియోగించారు. 40 అల్ట్రా హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేయబడిన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చు.

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 ప్లస్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ల వివరాల గురించి తెలియాల్సి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ పీచ్‌ ఫజ్‌, బ్లూ, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అందులో 64MP ప్రధాన కెమెరా సహా మరిన్ని కెమెరాలు ఉండనున్నాయి. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై మోటోరోలా అధికారిక ప్రకటన చేయలేదు.

**మోటోరోలా నుంచి మే 16న మధ్యాహ్నం 12 గంటలకు ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫారెస్ట్‌ బ్లూ, హాట్‌ పింక్, మార్ష్‌మల్లో బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజర్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 144Hz రీఫ్రెష్‌ రేట్, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల కానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హలో UI పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 7s జెన్‌ 2 SoC పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYTIA 700c ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 68W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Razr 50 Ultra smartphone specs and price leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X