Home
Mobile

మోటోరోలా కొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌పై కీలక వివరాలు లీక్‌.. గత మోడల్‌ కంటే మెరుగైన ఫీచర్లతో..!!

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ (Motorola Razr 50 Ultra) ఈ సంవత్సరం విడుదల కానుంది. రేజర్‌ 40 అల్ట్రా ఫోన్‌కు తర్వాత తరం ఫోన్‌గా రానుంది. ఈ ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఈ కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ తాజాగా యూరేసియన్‌ ఎకనామిక్‌ కమిషన్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫలితంగా మరికొన్ని వారాల్లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

ఈ EEC వెబ్‌సైట్‌లో మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ XT243-1 మోడల్‌ నంబర్‌ను కలిగి ఉంది. కామ్‌షెల్‌ స్టైల్ ఫోల్డబుల్‌ స్టైల్‌ ఫోల్డబుల్‌గా రానుంది. మరియు పాత మోడల్‌ కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా మరియు రేజర్‌ 40 గత సంవత్సరం భారత్‌లో లాంచ్‌ అయ్యాయి.

Motorola Razr 50 Ultra smartphone

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MyUX పైన పనిచేస్తుంది. అల్ట్రా మోడల్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల పుల్‌ HD+ ఫోల్డబుల్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 3.6 అంగుళాల pOLED అవుటర్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.

అదే రేజర్ 40 మోడల్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.9 అంగుళాల పుల్‌ HD+ pOLED ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5 అంగుళాల OLED అవుటర్‌ స్క్రీన్‌ కలిగి ఉంది. దీంతోపాటు అల్ట్రా మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అదే రేజర్‌ 40 మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC చిప్‌తో వస్తుంది.

Motorola Razr 50 Ultra smartphone

ఈ రెండు మోడళ్లు డ్యూయల్‌ రియర్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అల్ట్రా మోడల్‌ OIS అప్టికల్‌ అమేజ్ స్టేబిలైజేషన్‌తో 12MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. అదే మోటోరోలా రేజర్‌ 40 మోడల్‌ 64MP ప్రైమరీ కెమెరా మరియు 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

గతంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫోల్డబుల్‌ ఫోన్లు... ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. మోటోరోలాతోపాటు శాంసంగ్‌, వన్‌ ప్లస్‌, షియోమీ, వివో, ఒప్పో సంస్థలు కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేశాయి. అయితే ఆపిల్‌ సంస్థ కూడా ఫోల్డబుల్‌ ఐఫోన్లను తయారుచేయనుందని తెలుస్తోంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్‌ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది.

ఐఫోన్‌ ఫోల్డబుల్‌ డివైస్‌లకు అవుటర్‌ డిస్‌ప్లే కలిగి ఉండాలని, ఫోల్డింగ్‌ చేసినప్పుడు కనిపించేలా ఉండాలని ఆపిల్‌ తన ఇంజినీర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిజైన్‌ త్వరగా బ్రేక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ఐఫోన్ల మాదిరిగా సన్నగా ఉండేలా డిజైన్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Razr 50 Ultra smartphone spotted on EEC website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X