మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల ఖరారు.. స్పెసిఫికేషన్‌లు, సేల్ పూర్తి వివరాలు..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి రేజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ (Motorola razr 50 Ultra Smartphone) వచ్చే వారంలో చైనాలో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోనూ త్వరలో లాంచ్ కానుంది. అమెజాన్ లైవ్ పేజీ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉండనుంది. దీంతోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉండనుంది.
అమెజాన్ లైవ్ పేజీ వివరాలు కచ్చితంగా మోటోరోలా రేజర్ 50 అల్ట్రా కు సంబంధించినవే అని వెల్లడించలేదు. కానీ మోటోరోలా పోల్డబుల్ ఫోన్ విడుదల కానుందని మాత్రం తెలిసింది. అయితే ఈ మోటోరోలా ఫోల్డబుల్ భారత్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. చైనాలో మాత్రం ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 25న లాంచ్ కానుంది.

మోటోరోలా రేజర్ 50 అల్ట్రా అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.9 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే మరియు 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు మరిన్ని రిపోర్టుల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 4000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఔటర్ డిస్‌ప్లే డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2x జూమింగ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా హ్యాండ్‌సెట్ అడాప్టివ్ స్టెబిలైజేషన్, యాక్షన్ షాట్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, ఫోటో ఎన్‌హేన్స్‌మెంట్ ప్రో, సూపర్ జూమ్, కలర్ ఆప్టిమైజేషన్, స్టైల్ సింక్, AI మేజిక్ కాన్వాస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
** భారత్ మార్కెట్‌లో ఇటీవలే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 6.7 అంగుళాల FHD+ 10 బిట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 (అవుట్ ఆఫ్ ది బాక్స్) OS, స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 50MP OIS + 50MP+ 64MP కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాతో విడుదల అయింది.
ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ధర రూ.59999 గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ.5000 డిస్కౌంట్ సహా ఎంపిక చేసిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5000 అదనపు తగ్గింపును పొందవచ్చు. జూన్ 24 నుంచి సేల్ ప్రారంభం అవుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








