మోటోరోలా Razr 60 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. 6.9 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా..!
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ నెలలోనే మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటోరోలా రేజర్ 60 హ్యాండ్‌సెట్ 30W టర్బో ఛార్జింగ్ పైన పనిచేస్తుంది. ఈ కెమెరా విభాగం క్వాడ్ పిక్సల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మోటో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
మోటోరోలో Razr 60 60 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Motorola Razr 60 Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ HD+ pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 3.63 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10 సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
చిప్‌సెట్, OS వివరాలు :
మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీలోనే అందుబాటులో ఉంది.
క్వాడ్ పిక్సల్ టెక్నాలజీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ క్వాడ్ పిక్సల్ టెక్నాలజీ, OIS తో 50MP కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 30W టర్బోఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజింగ్, ప్రొడక్టివిటీ టూల్స్‌తో కూడిన మోటో AI సూట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
మోటోరోలో Razr 60 ధర, సేల్ వివరాలు :
మోటోరోలో Razr 60 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. ధర రూ.49,999 గా ఉంది. జూన్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. పాంటోన్ జిబ్రల్టర్ సీ వేరియంట్ ఫ్యాబ్రిక్ తరహా ఫినిష్‌ను కలిగి ఉంది. అదే పాంటోన్ లైటెస్ట్ స్కై వేరియంట్ మార్బుల్ తరహా ఫినిష్ అదే పాంటోన్ స్ర్పింగ్ బడ్ వేరియంట్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








