Home
Mobile

మోటోరోలా నుంచి రెండు ఫోల్డబుల్‌ ఫోన్‌లు విడుదల.. భారీ డిస్‌ప్లే, టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సహా..!

మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోని ఇటీవల మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌తోపాటు ఎడ్జ్‌ 60 స్టైలస్‌ ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే తాజాగా గ్లోబల్‌ మార్కెట్‌లో మోటోరోలా Razr 60 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో రెండు మోటోరోలా Razr 60, Razr 60 అల్ట్రా ఫోన్లు (Motorola Razr 60 Series Launched) విడుదల అయ్యాయి. ఈ రెండు ఫోల్డబుల్‌ ఫోన్‌లుగా ఉన్నాయి.

మోటోరోలా రేజర్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.96 అంగుళాల ఫుల్‌ HD+ pOLED LTPO ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 3.63 అంగుళాల pOLED కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కవర్ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Motorola Razr 60 series

ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB LPDDR4X ర్యామ్‌ మరియు 512GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత MyUX పై పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. ఇన్నర్‌ డిస్‌ప్లే పైన 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 30W టర్బోపవర్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ IP48 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 5G, వైఫై, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

మోటోరోలా రేజర్‌ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
అల్ట్రా మోడల్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 7 అంగుళాల pOLED LTPO ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్‌ సపోర్టుతో వచ్చింది. 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4 అంగుళాల pOLED, LTPO కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ సిరామిక్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MYUX ను కలిగి ఉంది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ అల్ట్రా వేరియంట్ OIS, f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలతోపాటు ఇన్నర్‌ డిస్‌ప్లే పైనా 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 68W టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6E, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

మోటోరోలా రేజర్‌ 60, రేజర్‌ 60 అల్ట్రా ధర, సేల్‌ వివరాలు :
మోటోరోలా రేజర్‌ 60 ధర అమెరికాలో $699 (భారత కరెన్సీ ప్రకారం రూ.60,000) గా ఉంది. అదే అల్ట్రా వేరియంట్‌ ధర అమెరికాలో $1399 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,11,000) గా ఉంది. ఈ ఫోన్‌ల సేల్‌ అమెరికాలో మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌లో విడుదల, సేల్‌ పై ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

Best Mobiles in India

English summary
Motorola Razr 60 series clamshell foldable smartphone launches globally
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X