మూడు 50MP కెమెరాలు. 7 అంగుళాల భారీ డిస్‌ప్లే, బెస్ట్ AI ఫీచర్‌లతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Motorola Razr 60 Ultra Smartphone : మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. మరియు రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో లాంచ్ అయింది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది. ఈ మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 68W వైర్ టర్బోపవర్, 30W వైర్‌లెస్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ మోటో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మెయిన్, కవర్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. 7 అంగుళాల 1.5K (1224x2992 పిక్సల్స్) pOLED LTPO ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది.
ఈ ప్రధాన డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్టు, HDR10+ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 4 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ Moto AI 2.0 సూట్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మోటో AI కీని కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
మోటోరోలా Razr 60 అల్ట్రా ధర, సేల్ వివరాలు :
మోటోరోలా Razr 60 అల్ట్రా 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది .ఈ ఫోన్ రియో రెడ్, మౌంటైన్ ట్రైయిల్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్ వేగాన్ లెదర్, FSC సర్టిఫైడ్ వుడ్, అల్కంటారా ఫినిష్‌లో లభిస్తుంది. మే 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో సేల్ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








