Home
Mobile

మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. 7 అంగుళాల డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరా..!

మోటోరోలా సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఇటీవల మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటికే ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌, ఎడ్జ్‌ 60 స్టైలస్‌, ఎడ్జ్‌ 60 ప్రో మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Motorola Razr 60 Ultra Smartphone) లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ మోటోరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌ కోసం ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది ? :
మోటోరోలా ఇండియా ప్రకటన ఆధారంగా మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో మే 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా మోటోరోలా ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.

motorola Razr 60 ultra

ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ మౌంటైన్‌ ట్రైల్‌, రియో రెడ్‌, స్కరబ్‌ కలర్‌ వేరియంట్స్‌తోపాటు వుడ్‌, వేగాన్‌ లెదర్‌, అల్కాంటారా ఫినిష్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ IP48 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌ రీడిజైన్డ్ టైటానియం హింజ్‌ను కలిగి ఉంటుంది.

మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 7 అంగుళాల 1.5K Flexview pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 165Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 4 అంగుళాల FHD+ pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ సిరామిక్‌ కవర్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

శక్తివంతమైన చిప్‌సెట్ :
అమెజాన్‌ మైక్రోసైట్‌ ఆధారంగా మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI (Skin) పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మోటో AI 2.0 సూట్‌ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా ఈ మోటోరోలా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చి ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు కూడా 50MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 68W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 33W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంటుంది.

మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అనంతరం మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌ (motorola.in) తోపాటు అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్‌ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర సుమారుగా లక్ష రూపాయలు ఉండే అవకాశం ఉంది. అమెరికా మార్కె్ట్‌లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర $1300 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,10,900) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
motorola Razr 60 ultra clamshell foldable Smartphone with set to launch on may 13 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X