రూ.10500 డిస్కౌంట్.. 7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్, మూడు 50MP కెమెరాల ఫోల్డబుల్ ఫోన్
భారత్ మార్కెట్‌లోకి మోటోరోలా నుంచి గతవారం మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఇవాళ్టి నుంచి ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేస్తోంది. మరియు మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
లక్ష రూపాయల ఫోన్ :
మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ (Motorola Razr 60 Ultra Smartphone Sale) 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99,999 గా ఉంది. ఈ ఫోన్ రియో రెడ్, మౌంటైన్ ట్రైయిల్, స్కరబ్ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్‌పై రూ.10 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రూ.10 వేల డిస్కౌంట్ :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో HDFC క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్ పైన కొనుగోలు చేస్తే రూ.10250 డిస్కౌంట్‌ను పొందవచ్చు, అదే HDFC క్రెడిట్ కార్డు నాన్ EMI ట్రాన్సాక్షన్ పైన కొనుగోలు చేస్తే రూ.10000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్ పైన రూ.10250 వరకు తగ్గింపును పొందవచ్చు.
ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు నాన్ EMI ట్రాన్సాక్షన్ పైన రూ.10 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. IDFC బ్యాంకు క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్ పైన రూ.10500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే IDFC బ్యాంకు క్రెడిట్ కార్డు నాన్ EMI ట్రాన్సాక్షన్ పైన రూ.10 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.
మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
మోటోరోలా Razr 60 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 7 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మరియు HDR10+, డాల్బీ విజన్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 4 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

శక్తివంతమైన ఫోన్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ లెన్స్, ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 68W వైర్ టర్బో పవర్, 30W వైర్‌లెస్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటోరోలా Razr 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ AI 2.0 సూట్, మోటో AI కీ ని కలిగి ఉంది. వేగాన్ లెదర్, FSC సర్టిఫైడ్ వుడ్, అల్కంటారా ఫినిష్‌లలో లభిస్తుంది. IP48 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








