మోటోరోలా బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. రెండు డిస్‌ప్లేలు, టెలిఫోటో లెన్స్ సహా పూర్తి వివరాలు!
CES 2026 లో మోటోరోలా తమ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ మోటో Razr ఫోల్డ్ పేరుతో తీసుకొచ్చింది. ఈ డివైజ్‌తో శాంసంగ్ Z ఫోల్డ్ 7 ఫోన్, గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీనివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోటో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
మోటోరో రేజర్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ వివరాలు :
మోటోరోలా ఇప్పటికే అనేక ఫ్లిప్ ఫోన్‌లను విక్రయిస్తోంది. ప్రస్తుతం బుక్ స్టైల్ ఫోల్డబుల్ డివైజ్‌లపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మోటోరోలా ఫోల్డ్ ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ 8.1 అంగుళాల 2K ప్రైమరీ స్క్రీన్, 6.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ డిస్‌ప్లేలు మోటో పెన్ అల్ట్రాను సపోర్టు చేస్తాయి. ఈ డిస్‌ప్లే అడాప్టివ్ ఇంటర్‌ఫేస్, మల్టీ టాస్కింగ్ కు సపోర్టు చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే భారీ డిస్‌ప్లేలకు సంబంధించిన కొన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను వివరించింది. అయితే ఈ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు.
కెమెరాల వివరాలు :
మోటోరోలా రేజర్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ LYTIA ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 3x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీంతోపాటు 32MP, 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. డాల్బీ విజన్ రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
పాంటోన్ బ్లూ, పాంటోన్ లిలీ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ఈ బుక్ స్టైల్ డిజైన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు. దీంతోపాటు మరిన్ని వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
1 ✖️ 2 ✖️ 3 ✖️… 6 ✅
— motorola (@Moto) January 7, 2026
Six new products, one goal: elevating your tech.
Read more about the latest Motorola launches: https://t.co/RnjoKRlcAn pic.twitter.com/twTCrEFozc
మోటోరోలా ఎడ్జ్ 70 :
ఇటీవలే భారత్ మార్కెట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5.99 mm థిక్‌నెస్ తో అల్ట్రా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ గ్యాడ్జెట్ గ్రే, పాంటోన్ లిలీ ప్యాడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ 68W వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ మోటోరోలా స్లిమ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సర్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








