మోటరోలా రేజర్‌ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్

|

లెనోవా సంస్థ యొక్క సబ్-బ్రాండ్ మోటరోలా సంస్థ గత నెలలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్‌ యొక్క డిజైన్‌ను క్లామ్‌షెల్ ద్వారా లాంచ్ చేసింది. ఇప్పుడు అతి త్వరలో దీనిని సరికొత్త అవతార్ రూపంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
 

త్వరలో మోటరోలా యొక్క ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వస్తుందని కంపెనీ తన ట్వీట్ ద్వారా తెలిపింది. కంపెనీ గత నెలలో క్లామ్‌షెల్ డిజైన్‌లో ఫోన్‌ను లాంచ్ చేసింది మరియు వచ్చే ఏడాది ప్రారంభంలో యుఎస్‌లో లాంచ్ కానుంది.

ట్విట్టర్ అకౌంట్

మోటరోలా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సంస్థ యొక్క అత్యంత ప్రియమైన మరియు జనాదరణ పొందిన ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా రేజర్‌ను త్వరలో ఇండియాలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం కంపెనీ చిన్న టీజర్ వీడియోను విడుదల చేసింది.

షియోమి ఫోన్‌లలో VoWiFi సర్వీసును యాక్టివేట్ చేయడం ఎలా?

 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్

మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మరియు హువాయి మేట్ ఎక్స్ లతో పోటీ పడనుంది. ఈ ఫోన్ క్లామ్‌షెల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ తో పోలిస్తే జేబులో సులభంగా సరిపోయే విధంగా కంఫోర్ట్ గా ఉంటుంది. మరోవైపు 1 మిలియన్ యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్‌ను విక్రయించిన తరువాత శామ్‌సంగ్ 2020లో మరో ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నది. అది కూడా క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తుందని తెలుస్తున్నది.

ఇండియాలో మోటరోలా రేజర్‌ ధర
 

ఇండియాలో మోటరోలా రేజర్‌ ధర

గ్లోబల్ ప్రైసింగ్ విషయానికొస్తే మోటరోలా రేజర్‌ను $1,499 ధర వద్ద కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,06,000 గా ఉంది. కాగా గెలాక్సీ ఫోల్డ్‌ను ఇండియాలో 1,64,999 రూపాయల ధర వద్ద విక్రయిస్తున్నారు. ఇండియాలో అధికారికంగా ప్రారంభించిన తర్వాత మాత్రమే మోటరోలా రేజర్‌ యొక్క ధరల వివరాలను సంస్థ వెల్లడిస్తుంది.

VoWiFi ఫీచర్ ను మొదలుపెట్టిన రిలయన్స్ జియో

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

మోటరోలా రేజర్‌ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది గెలాక్సీ ఫోల్డ్ మాదిరిగానే సౌకర్యవంతమైన ఫోల్డబుల్ స్క్రీన్‌తో వస్తుంది. అయితే ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తుంది. అంతేకాకుండా పాత ఐకానిక్ మోటో రేజర్‌ను మీకు గుర్తు చేస్తుంది. ఈ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు అది 2.7-అంగుళాల క్విక్ వ్యూ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది బాహ్య భాగంలో 00 × 800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఉంటుంది. ఈ డిస్ప్లే నోటిఫికేషన్‌లను వీక్షించడానికి, గూగుల్ అసిస్టెంట్‌ను యాక్టీవేట్ చేయడానికి, మ్యూజిక్ ను నియంత్రించడానికి మరియు సెల్ఫీలను తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఫోల్డ్ చేయకముందు 21: 9 కారక నిష్పత్తి మరియు 876 × 2,142 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.2-అంగుళాల సౌకర్యవంతమైన OLED HD + స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

వాట్సాప్ స్టేటస్‌లోని ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

OS

OS విషయానికి వస్తే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC ప్రాసెసర్ తో జత చేయబడి అలాగే 6GB RAMను కలిగి ఉంటుంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 9 పైతో రన్ అవుతుంది. అలాగే ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా 2,510 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని దిగువ భాగాన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దీని ద్వారా ఫోన్ ఎటువంటి స్థితిలో వున్న యాక్సెస్ చేయవచ్చు.

కెమెరా

కెమెరా సామర్ధ్యాల విషయానికొస్తే మోటరోలా రేజర్‌ f/1.7 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇదే కెమెరాను ఫోల్డ్ చేసినప్పుడు సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోగించవచ్చు. తక్కువ కాంతి వున్న పరిస్థితులలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీయడానికి కెమెరా నైట్ విజన్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. మెయిన్ డిస్ప్లేలో సెల్ఫీలు తీసుకోవడానికి 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో eSIM కార్డులు మరియు NFC ఉన్నాయి. బ్లూటూత్ 5.0, వై-ఫై 802.11ac, 4G LTE మరియు జిపిఎస్ ఉన్నాయి. ఫోన్ 72x172x6.9mm ఫోల్డ్ చేయక ముందు మరియు ఫోల్డ్ చేసిన తరువాత 72x94x14mm కొలతలను కలిగి ఉండి 205 గ్రాముల బరువుతో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola Razr Foldable Phone To Arrive India Quite Soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X