మోటరోలా యూజర్లకు పండుగ లాంటి వార్త

|

ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్‌డేట్‌ను పొందే మోటో ఫోన్‌ల జాబితాను మోటరోలా విడుదల చేసింది. ప్రస్తుత మోటరోలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన మోటో జెడ్, మోటో జెడ్ ఫోర్స్, మోటో జెడ్ ప్లేలు తొలిగా ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్‌ను పొందబోతున్నాయి.

మోటరోలా యూజర్లకు పండుగ లాంటి వార్త

Read More : హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న 20 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఆ తరువాత మోటో జీ (4th Gen), మోటో జీ ప్లస్ (4th Gen), మోటో జీ ప్లే (4th Gen), మోటో ఎక్స్ ప్యూర్ ఎడిషన్ (3th Gen), మోటో ఎక్స్ స్టైల్, మోటో ఎక్స్‌ప్లే, మోటో ఎక్స్ ఫోర్స్, డ్రాయిడ్ టర్బో 2, డ్రాయిడ్ మాక్స్ 2, మోటో జెడ్, మోటో జెడ్ డ్రాయిడ్, మోటో జెడ్ ఫోర్స్ డ్రాయిడ్, మోటో జెడ్ ప్లే, మోటో జెడ్ ప్లే డ్రాయిడ్, నెక్సుస్ 6 ఫోన్‌లను ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ వర్తిస్తుంది.

మోటరోలా యూజర్లకు పండుగ లాంటి వార్త

Read More : గూగుల్ తయారు చేసిన పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయ్..?

ఆండ్రాయిడ్ Nougat ఆపరేటింగ్ సిస్టంలో 250 మేజర్ ఫీచర్స్ ఉన్నట్లు గూగుల్ చెబుతోంది. ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే కొత్త ఫీచర్లు ఏంటంటే..?

పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌...

పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌...

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో సెట్టింగ్స్ యాప్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. పలు మార్పు చేర్పులతో వస్తోన్న ఈ యాప్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత వేగంగా ముందకు నడిపిస్తుంది. ఫొన్ సెట్టింగ్జ్ అడ్జస్ట్ చేసుకునేందుకు యూజర్ ప్రతిసారి సబ్ మెనూలోకి వెళ్లకుండా మెయిన్ మెనూ ద్వారానే కావల్సిన సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా సబ్ టైటిల్ వ్యవస్థ ఉంటుంది.

మల్టీ-విండో మోడ్‌

మల్టీ-విండో మోడ్‌

గూగుల్ ఎట్టకేలకు తన సరికొత్త ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ ద్వారా మల్టీ-విండో మోడ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సౌలభ్యతతో ఫోన్‌లోని యాప్స్‌ను split- screen మోడ్‌లో, ఫోటోలను picture-in-picture మోడ్‌లో ఓపెన్ చేసుకోవచ్చు.

 నైట్ మోడ్  ఫీచర్‌..

నైట్ మోడ్ ఫీచర్‌..

గూగుల్ తన ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్‌లో నైట్ మోడ్ ఫీచర్‌ను పొందుపరిచింది. ఈ నైట్ మోడ్ ఆప్షన్ ద్వారా యూజర్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను రాత్రి వేళల్లో డార్క్ కలర్‌కు మార్చుకోవచ్చు. తద్వారా మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించవచ్చు.

Unicode 9 సపోర్ట్

Unicode 9 సపోర్ట్

ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ Unicode 9ను సపోర్ట్ చేస్తుంది. అంటే సరికొత్త emojis మీకోసం వస్తున్నాయన్నమాట.

క్విక్ సెట్టింగ్స్‌

క్విక్ సెట్టింగ్స్‌

ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ అప్‌డేటెడ్ క్విక్ సెట్టింగ్స్‌తో వస్తోంది. ఒకే స్వైప్‌తో ఫ్లాష్‌లైట్‌, వైఫై, బ్లూటూత్ లాంటివే కాకుండా మనకు నిత్యం ఉపయోగపడే ఐకాన్స్‌ మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్‌లో సెట్‌ చేసుకోవచ్చు.

రీసెంట్ యాప్ మెనూ..

రీసెంట్ యాప్ మెనూ..

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలోని రీసెంట్ యాప్ మెనూ, స్వల్ప మార్పు చేర్పులతో వస్తోంది. ఈ మెనూ ద్వారా, ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతోన్న యాప్‌లకు సంబంధించిన వివరాలను పెద్ద కార్డ్‌లలో చూసుకోవచ్చు.

 Project Svelte

Project Svelte

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌‌ Project Svelte ఫీచర్‌తో కంటిన్యూ అవుతుంది. ఈ ఫీచర్, ఫోన్‌ ప్రాసెసింగ్ అలానే బ్యాటరీ సేవింగ్‌ విభాగాలు మరింత యాక్టివ్‌గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

 సిస్టం లెవల్ నెంబర్ బ్లాకింగ్

సిస్టం లెవల్ నెంబర్ బ్లాకింగ్

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా గూగుల్..  సిస్టం లెవల్ నెంబర్ బ్లాకింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ నేటివ్ సపోర్ట్ ద్వారా ఫోన్‌కు వచ్చే అన్‌వాంటెడ్ నెంబర్లను బ్లాక్ చేయవచ్చు.

Always on VPN

Always on VPN

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌‌లో వచ్చే Always on VPN ఫీచర్ ద్వారా ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకోవచ్చు.

డేటా సేవర్ ఆప్షన్

డేటా సేవర్ ఆప్షన్

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌‌లో వచ్చే డేటా సేవర్ ఆప్షన్ ద్వారా ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్‌ను కంట్రోల్ చేసుకుంటూ డేటాను మరింత ఆదా చేసుకోవచ్చు.

Emergency Information feature

Emergency Information feature

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా గూగుల్ Emergency Information featureను అందిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ ఫీచర్ ద్వారా యూజర్ మెడికల్ డిటెయిల్స్ అలానే వ్వక్తిగత కాంటాక్ట్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఫోన్‌లోని ఎమర్జెన్సీ బటన్ పై టాప్ చేయటం ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు.

 Doze mode

Doze mode

ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌ ద్వారా ఫోన్‌లోని పైల్స్‌ను సులువుగా మేనేజ్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ నౌగట్ వర్షన్‌లో ఏర్పాటు చేసిన Doze mode ఫీచర్ ఫోన్ బ్యాటరీ శక్తిని మరింత ఆదా చేస్తుంది.

Best Mobiles in India

English summary
Motorola reveals names of smartphones eligible for Android 7.0 Nougat upgrade. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X