మోటరోలా నుంచి మరోపెద్ద స్మార్ట్‌ఫోన్

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో సంచలనాల దిశగా దూసుకువెళుతోన్న మోటరోలా మరో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు ముస్తాబవుతోందా..?, అవుననే అంటున్నాయి రూమర్ మిల్స్. ప్రముఖ ఆండ్రాయిడ్ ఫ్యాన్ బ్లాగ్ Mallando no Android on సోమవారం పోస్ట్ చేసిన ఓ ఫోటో ఈ వార్తకు మరింత బలం చేకూరుస్తోంది.

మోటరోలా నుంచి మరోపెద్ద స్మార్ట్‌ఫోన్

ఈ ఫోటోలో తారస పడిన డివైస్‌ను మోటో జి స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్ అయిన మోటో జీ2గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మోటో జి డిజైనింగ్‌కు దగ్గర పోలికలను కిలిగి ఉన్న ఈ డివైస్ మోడల్ నెంబరును XT1068గా సదరు బ్లాగ్ పేర్కొంది. క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 720 పిక్సల్ సామర్థ్యం గల డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ కెమెరా అలానే డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉందంటూ సదరు బ్లాగ్ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot