మోటరోలా నుంచి 8 స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా (Motorola) భారీ లక్ష్యాలను చేధించే దిశగా ముందుకు సాగుతోంది. మోటో ఇ, మోటో జీ
స్మార్ట్‌ఫోన్‌లతో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో తన సత్తాను చాటుకున్న మోటరోలా తన భవిష్యత్ కార్యాచరణను మరింత ప్రణాళికాబద్దంగా రూపొందింస్తోంది. 2014 చివరి నాటికి మరో 8 స్మార్ట్‌ఫోన్‌లను మోటరోలా, మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

 
మోటరోలా నుంచి 8 స్మార్ట్‌ఫోన్‌లు

డ్రాయిడ్, డ్రాయిడ్ మాక్స్, డ్రాయిడ్ టర్బో, మోటో ఎక్స్+1, మోటో జీ2 , మోటో ఎక్స్ ప్లే, మోటో ఎస్ మోడళ్లలో ఈ ఫోన్‌లు ఉంటాయని సమాచారం. అయితే, ఈ ఫోన్‌లకు సంబంధించి మోటరోలా ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటనను వెలువరించలేదు.

 

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతున్న మోటీ జీ2 స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.మోటో జీ2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు మోటో జీ2, సెప్టంబర్ 10నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నెలలో యాపిల్ తన ఐఫోన్ 6ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

మోటో జీ2 స్పెసిఫికేషన్‌లు..? (అంచనా మాత్రమే)

720 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

రిటైల్ మార్కెట్లో మోటో జీ2 ధర..? (అంచనా మాత్రమే)

ఇండియన్ మార్కెట్లో మోటో జీ2 ఫోన్ ధర రూ.20,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X