Home
Mobile

50MP + 50MP + 50MP + 50MP కెమెరాలు, అల్యూమినియం ఫ్రేమ్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో స్మార్ట్‌ఫోన్!

Motorola Signature Smartphone : మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల సూపర్‌ HD LTPO ఎక్స్‌ట్రీమ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 165Hz రీఫ్రెష్‌ రేట్‌, 6200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్‌ డెన్సిటి, 20:9 యాస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Motorola Signature features

ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌, HDR10+ సపోర్టు, SGS బ్లూ లైట్‌ రిడక్షన్‌, మోషన్ బ్లర్‌ రిడక్షన్‌ సర్టిఫికేషన్‌ సర్టిఫికేషన్‌లు ఉన్నాయి. ఈ డిస్‌ప్లే స్మార్ట్ వాటర్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ డిస్‌ప్లేను నియంత్రించుకోవచ్చు.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, అల్యూమినియం ఫ్రేమ్‌ :
ఈ ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్‌ 16 OS :
మోటో సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ 3nm ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత మోటోరోలా Hello UI పైన పనిచేస్తుంది.

Motorola Signature features

మెరుగైన కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్‌, 3x ఆప్టికల్ జూమ్‌, 100x హైబ్రిడ్‌ జూమ్‌, OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు :
సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.0 అపేచర్‌తో 50MP సోనీ LYT 500 కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ 10W వైర్‌లెస్‌, 5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 41 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటోరోలా చెబుతోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 6, వైఫై 7, GPS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్‌, ఇ-కంపాస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999, 16GB ర్యామ్‌ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది.

HDFC బ్యాంకు, యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ జనవరి 30 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. పాంటోన్‌ కార్బన్‌, పాంటోన్‌ మార్టిని ఓలివ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Signature launched with four 50MP cameras in india full specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X