Motorola Signature : మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు!
మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌లో జనవరి 23 వ తేదీన మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవల చైనా మార్కెట్‌లో విడుదల అయిన మోటో X70 ఎయిర్ ప్రో మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు యూరప్ మార్కెట్‌లో సిగ్నేచర్ మోడల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ (Motorola Signature Smartphone) ధర సహా ఇతర కీలక వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సంజు చౌదరి ఈ వివరాలను వెల్లడించారు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59999 గా ఉంటుందని అంచనా వేశారు. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64999 గా ఉంటుందని చెప్పారు.

బ్యాంకు ఆఫర్లు! :
ఈ ఫోన్ 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్‌లోనూ అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఈ ఫోన్ ధర రూ.69999 గా ఉంటుందని తెలిపారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలుస్తోంది. రూ.7500 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చని చెబుతున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పాంటోన్ మార్టిని ఓలివ్, పాంటోన్ కార్బన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే ధర సహా బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ బోనస్‌లపై మోటోరోలా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

165Hz రీఫ్రెష్ రేట్ :
ఇప్పటికే ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6200 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ సపోర్టును కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
7 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
నాలుగు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 828 సెన్సర్ ఉంది. 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్ లెన్స్ ఉంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు ఫోన్ 50W వైర్‌లైస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. 10W వైర్, 5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ MIL STD 810H సర్టిఫికేషన్, IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








