నాలుగు 50MP కెమెరాలు, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, శక్తివంతమైన చిప్‌సెట్ 5G ఫోన్ సేల్!
Motorola Signature Sale : మోటోరోలా సంస్థ ఇటీవల ప్రీమియం సెగ్మెంట్లో మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ ఏకంగా నాలుగు 50MP కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు వైర్‌లైస్ ఛార్జింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
భారత్ మార్కెట్‌లో మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ మార్టిని ఓలివ్, పాంటోన్ కార్బన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.64,999, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.69,999 గా ఉంది. యాక్సెస్, HDFC బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అల్యూమినియం ఫ్రేమ్ :
మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్, MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 165Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల సూపర్ HD LTPO ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
ఈ డిస్‌ప్లే 6200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటిని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్టు ఉంది. HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. SGS బ్లూ లైట్ రిడక్షన్, మోషన్ బ్లర్ రిడక్షన్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్‌లున్నాయి. స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్ ఉంది.
ప్రాసెసర్, OS వివరాలు :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటోరోలా Hello UI పైన పనిచేస్తుంది.
నాలుగు 50MP కెమెరాలు :
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. మొత్తంగా నాలుగు 50MP కెమెరాలున్నాయి. వెనుక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ మరియు 100X హైబ్రిడ్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్, OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 50MP సోనీ LYT 500 సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 90W వైర్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 10W వైర్‌లెస్, 5W వైర్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 41 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటోరోలా చెబుతోంది.


Click it and Unblock the Notifications








