Moto G5s స్మార్ట్‌ఫోన్‌పై రూ. 5వేలు తగ్గింపు, ఒక్కరోజు మాత్రమే, Moto G6 లాంచ్ డేట్ షురూ !

మోటోరోలా నుంచి వచ్చిన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ Moto G5s ధర భారీగా తగ్గింది. ఈ పాపులర్ మిడ్ రేంజ్ Moto G5s స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా రూ. 5వేలు తగ్గింది.

|

మోటోరోలా నుంచి వచ్చిన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ Moto G5s ధర భారీగా తగ్గింది. ఈ పాపులర్ మిడ్ రేంజ్ Moto G5s స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా రూ. 5వేలు తగ్గింది. లాంచ్ సమయంలో దీని ధర రూ. 14,999 ఉండగా ఇప్పుడు రూ. 5 వేలు తగ్గి కేవలం రూ.999కే లభిస్తోంది. కాగా ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 11 సోమవారం రోజున అమెజాన్లో ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్ కింద కంపెనీ ఈ ఫోన్ మీద తగ్గింపును అందిస్తోంది. కాగా కంపెనీ 45వ యానివర్సరీ ప్రమోషన్ కింద ఈ డిస్కౌంట్ ని అందించనుంది. కాగా ప్రపంచంలొ తొలి మొబైల్ మొటోరోలా నుంచి 45 ఏళ్ల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. మోటోరోలా ఉద్యోగి మార్టిన్ కూపర్ Motorola DynaTAC 8000xని April 3, 1973న ఆవిష్కరించిన సంగతి విదితమే. ఈ ఆనందాన్ని పురస్కరించుకుని కంపెనీ Moto G5sపై భారీ తగ్గింపును అందిస్తోంది. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది. మోటో జీ6 లాంచ్ తేదీ ఫిక్స్ అయిన నేపథ్యంలో Moto G5s ఫోన్ అమ్మకాలు పెంచుకునేందుకు కూడా తగ్గింపును అందిస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 19న మోటో జీ6 అలాగే మోటో జీ6 ప్లస్, మోటోజీ6 ప్లే ఫోన్లు లాంచ్ కానున్నట్లు కంపెనీ నుంచి ఇప్పటికే మీడియాకు సమాచారం అందింది. కాగా Moto G5s, మోటో జీ6 ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

నోకియా 8 సిరోకో vs నోకియా 7 ప్లస్ vs నోకియా 8, బెస్ట్ ఏదీ...?నోకియా 8 సిరోకో vs నోకియా 7 ప్లస్ vs నోకియా 8, బెస్ట్ ఏదీ...?

మోటో జీ5ఎస్ ప్ల‌స్ ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

Moto G5s price

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ6ను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయనుంది. కాగా రూ.16,250 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానున్నట్లు తెలిసింది. దీంతో పాటు మోటో జీ6 ప్లస్, మోటోజీ6 ప్లే ఫోన్లు లాంచ్ ఆ రోజునే లాంచ్ కానున్నాయి.
మోటో జీ6 ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Best Mobiles in India

English summary
Motorola slashes Moto G5s price ahead of Moto G6 launch in India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X