మోటరోలా జంట పక్షులు..

Posted By: Prashanth

మోటరోలా జంట పక్షులు..

 

అమెరికాకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ అయిన మోటరోలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌తో పాటు, హై ఎండ్ మొబైల్ ఫోన్స్‌ని కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించడంలో మోటరోలా దిట్ట. కొత్త టెక్నాలజీతో మోటరోలా మార్కెట్లోకి రెండు కొత్త మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. వాటి పేర్లు వరుసగా 'మోటరోలా స్పైస్, మోటరోలా ఫైర్.'

రెండు మొబైల్స్ కూడా క్వర్టీ కీప్యాడ్‌తో పాటు ఫామ్ ప్యాక్టర్‌ని కలిగి ఉండడం విశేషం. మోటరోలా ఫైర్ బరువు 110 గ్రాములు. అదే మోటరోలా స్పైస్ మొబైల్ బరువు 145 గ్రాములు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను రెండు మొబైల్స్‌లలో కూడా 1420 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మోటరోలా ఫైర్ మొబైల్ 2.8ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లేతో పాటు, 240 x 320 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది.

అదే మోటరోలా స్పైస్ మాత్రం 3 ఇంచ్ డిస్ ప్లేని కలిగ ఉంది. రెండు మొబైల్స్‌లలో కూడా 3 మెగా ఫిక్సల్ కెమెరాలని నిక్షిప్తం చేయడం జరిగింది. డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకత. రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండడం ఇక్కడ సంతోషించతగ్గ విషయం. మోటరోలా స్పెస్ మొబైల్ 'ఆండ్రాయిడ్ వర్సన్ 2.1 ఈక్లెయిర్' ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండగా, మోటరోలా ఫైర్ మొబైల్ మాత్రం 'ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్'తో రన్ అవుతుంది.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. మోటరోలా స్పెస్ మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 90 MBమెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి మెమరీ కార్డు ద్వారా 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. రెండు మొబైల్స్‌లలోను ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్స్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్ మొబైల్‌తో పాటు ప్రత్యేకం.

మోటరోలా స్పెస్ మొబైల్ ప్రత్యేకతలు:

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.1

* ప్రాసెసర్: 528 MHz Qualcomm MSM7225

* డిస్ ప్లే: 3-inch capacitive touchscreen

* రిజల్యూషన్: QVGA 320 x 240

* మెమరీ: 256 MB RAM, 512 MB ROM, microSD (up to 32 GB)

* కెమెరా: 3.2 MP

* బ్రౌజర్: Android WebKit with Adobe Flast Lite

* బ్లాటూత్: 2.1 + EDR

* వై-పై: 802.11 b/g

* బ్యాటరీ:1420 mAh Li-Ion

మోటరోలా ఫైర్ మొబైల్ ప్రత్యేకతలు:

* ఆపరేటింగ్ సిస్టమ్:     Android 2.3 with MOTO SWITCH UI

* ప్రాసెసర్: 600MHz Qualcomm MSM7225, 256MB

* డిస్ ప్లే:     2.8 inches capacitive touchscreen

* రిజల్యూషన్: QVGA     240x320

* మెమరీ:     512MB, microSD/SDHC up to 32 GB

* కెమెరా: 3 MP

* బ్యాటరీ:1420 mAh Li-Ion

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot