ఆండ్రాయిడ్ ఓఎస్‌తో మోటరోలా సూపర్ ఫోన్

Posted By: Super

ఆండ్రాయిడ్ ఓఎస్‌తో  మోటరోలా సూపర్ ఫోన్

ఇండియన్ మొబైల్ మార్కెట్లో మోటరోలా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానం కోసం ప్రయత్నిస్తుంది. కొత్త కొత్త మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అందులో భాగంగానే త్వరలో ఇండియన్ మార్కెట్లోకి ఓ సూపర్ ఫోన్‌ని ప్రవేశపెడుతుంది. దానిపేరు మోటరోలా ఎక్స్‌టి 860 4జి. ఇదే మొబైల్‌ని అమెరికన్, కెనడియన్ మార్కెట్లలలో డ్రాయిడ్ 3గా పిలుచుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న మొబైల్ ఫోన్స్‌లలో అతి చిన్న, సన్నదైన క్వర్టీ కీప్యాడ్ స్లైడర్ ఫోన్ ఈ మోటరోలా ఎక్స్‌టి 860 4జి. ఈ మొబైల్ టచ్ అండ్ టైపు మొబైల్. ఇది మాత్రమే కాకుండా చూడడానికి చాలా అందంగా స్లైడింగ్ ఫిజికల్ కీప్యాడ్‌ని కలిగి ఉండి యూజర్స్ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది.

మోటరోలా ఎక్స్‌టి 860 4జి 4ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి ఫిజికల్ కీప్యాడ్ దీని సోంతం. యూజర్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిండమే కాకుండా మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా జరగడానికి ఇందులో ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వేయడం జరిగింది. మోటరోలా ఎక్స్‌టి 860 4జి మంచి పోటోలను తీసేందుకు గాను క్లాసీ, పవర్ పుల్ 8 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. అంతేకాకుండా ఇది 1080p వీడియో రికార్డింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. మొబైల్‌తో పాటు 16జిబి మొమొరీ నిక్షిప్తంకాగా మైక్రో ఎస్‌డి స్టాట్ ద్వారా బయట మొమొరీని 32 GB విస్తరించుకోవచ్చు.

మోటరోలా ఎక్స్‌టి 860 4జి మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ విషయాలలో యూజర్స్‌ని నిరాశ పరచదు. ఆడియో, వీడియో ప్లేబ్యాక్‌లతో పాటు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేయడమే కాకుండా, హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. మోటరోలా ఎక్స్‌టి 860 4జి 1GHz ప్రాసెసర్‌తో 512 MB RAMతో రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ పనులు చేసేటప్పుడు హై స్పీడ్ డేటా ప్రాసెసింగ్‌తో పని చేస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, GPRS, EDGEలతో పాటు యుఎస్‌బి పిసి సింక్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Motorola XT860 4G or Droid 3 phone specifications:

8 Mega Pixel Camera with 1080p video recording
Android OS
16 GB internal memory
4G, 3G and Wi-Fi
Bluetooth, GPRS and EDGE
Up to 32 GB expandable memory
Java support
1GHz processor
GPS with AGPS

మోటరోలా ఎక్స్‌టి 860 4జి ధరను ఇంకా మార్కెట్లో నిర్ణయించ లేదు. ఇండియన్ మార్కెట్లో మోటరోలా ఎక్స్‌టి 860 4జి మొబైల్ 2012 ప్రధమార్దంలో రావచ్చునని భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot