మోటోరోలా నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్.. కర్వడ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ సహా
Motorola Upcoming Smartphone : మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌లో ఇటీవలే మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు మోటోరోలా Razr 60 సిరీస్ కూడా లాంచ్ అయింది. త్వరలో మరో ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ టీజర్‌ను మోటోరోలా షేర్ చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్ పేరును వెల్లడించలేదు.
మోటోరోలా ఇండియా X పోస్ట్ ద్వారా ఈ వివరాలను అందించింది. త్వరలో విడుదల చేస్తామనే వివరాలను మాత్రమే చెప్పింది. ఫోన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే కొన్ని లీక్స్ ఆధారంగా మోటో G96 5G ఫోన్‌గా భావిస్తున్నారు. మరియు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా ఈ ఫోన్ కీలక వివరాలు వెల్లడయ్యాయి.

ఈ ఫోన్ ఎప్పుడు విడుదల కానుందో వెల్లడి కాకపోయినా.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా మాత్రం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ లైవ్‌లో ఉంది. దీని ఆధారంగా త్వరలో లాంచ్ కానున్న మోటోరోలా ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యూనిఫాం బెజెల్స్, పంచ్ హోల్ కటౌట్ ను కూడా కలిగి ఉంటుంది.
మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌ను అందించే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా మోటోరోలా ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే తాజా లీక్స్ ఆధారంగా 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 8MP మ్యాక్రో విజన్ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
To the trendsetters, the creators, the bold ones - #AllEyesOnYou#ComingSoon #Motorola pic.twitter.com/scJKsTE09i
— Motorola India (@motorolaindia) June 26, 2025
మోటోరోలా నుంచి ఇటీవల ఎడ్జ్ 60 మోడల్ లాంచ్ అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. ఫోన్ 6.67 అంగుళాల 1.5K pOLED క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ మోటో ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్, IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మోటో AI 2.0 సూట్, ఫోన్ డిస్‌ప్లే వాటర్ టచ్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








