జూన్ చివరివారంలో విడుదలకు సిద్దమైన మోటరోలా టైటానియమ్, ధీరీ

Posted By: Super

జూన్ చివరివారంలో విడుదలకు సిద్దమైన మోటరోలా టైటానియమ్, ధీరీ

ప్రపంచంలో ప్రస్తుతం ఉత్తమమైన మొబైల్ హ్యాండ్ సెట్‌‌లను తయారు చేస్తున్నటువంటి కంపెనీలలో మోటరోలా ఒకటి. ఆసియా, అమెరికా మార్కెట్లలలో మోటరోలాకి మంచి డిమాండ్ ఉంది. రాబోయే ఐదారు సంవత్సరాలలో వరల్డ్ నెంబర్ వన్ కావలనే ఉద్దేశ్యంతో తన ప్రణాళికలను అమలుపరుస్తుంది. చావోరేవో అనేలాగ తన యొక్క టార్గెట్‌లను పూర్తి చేస్తుంది. గతంలో మోటరోలా కంపెనీకి ఇండియాలో మంచి కస్టమర్స్ ఉన్నప్పటికీ రానురాను ఆ కస్టమర్స్ సంఖ్య తగ్గుతూ వచ్చిందని సమాచారం. ఐతే ప్రస్తుత పరిణామాలకు తట్టుకోని మోటరోలా తనయొక్క ఉత్పత్తులను నోకియా, శ్యామ్ సంగ్, సోనీ ఎరిక్సన్‌లకు పోటీగా రంగంలోకి దిగడమైంది.

అందులో భాగంగానే రాబోయే కాలంలో ఇండియన్ మార్కెట్ లోకి రెండు కొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ రెండు మోడళ్లు మోటరోలా టైటానియమ్, మోటరోలా ధీరీ. ఈ రెండు మోడళ్లు కూడా జూన్ చివరివారం లోపు మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక మోటరోలా ధీరీ నార్మల్ మల్టీమీడియా ఫోన్ కాగా, మోటరోలా టైటానియమ్ మాత్రం మద్యతరగతి, ఆపై వారిని దృష్టిలో పెట్టుకోని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ధీరీ మోడల్ ఫోన్ చూడడానికి క్యాండీ బార్ ఫోన్ మాదిరి చాలా చిన్న స్క్రీన్ సైజు కలిగి ఉండి, ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్ ఉంటుంది. టైటానియమ్ మాత్రం పెద్దదిగా ఉండి టచ్ స్క్రీన్ మొబైల్. టైటానియమ్‌లో సినిమాలు చూడడానికి వీలుగా పెద్ద స్క్రీన్‌తో పాటు మంచి మంచి గేమ్స్ ఆడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

రెండు మొబైల్ ఫోన్స్‌లో కెమెరాలు ఉన్నప్పటికీ టైటానియమ్‌లో 5మెగా ఫిక్సల్ కెమెరా కాగా, ధీరీలో మాత్రం 1.3మోగా ఫిక్సల్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్స్ లలో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. కానీ అది హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్ మాత్రం కాదు. ఇక మోటరోలా దీరీ మాత్రం జావా బేసిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అదే మోటరోలా టైటానియమ్ మాత్రం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక రెండు మొబైల్ ఫోన్స్ ఖరీదు మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు. లేటెస్ట్ మొబైల్ అప్‌డేట్స్ కావాలంటే వన్ ఇండియాతో టచ్‌లో ఉంచండి.

Motorola Theory Specifications:

Screen size: 2.4 inch (101.60 mm)
Resolution: 240 x 320
Resolution: 1.3 megapixels
Support Audio: AAC, AMR, MP3, MP4, WAV
Support Video: 3GP, MPEG-4 (MP4)
Bluetooth 2.0

Motorola Titanium Specifications:

5-megapixel camera with 4x zoom & flash
3.1-inch touchscreen display
Video recording capacity
Runs on Android 2.1

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot