Home
Mobile

మోటోరోలా నుంచి త్వరలో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ధర, కలర్‌ వేరియంట్స్‌ వివరాలు లీక్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా (Motorola) త్వరలో వివిధ మోడళ్లను లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌ మార్కెట్‌ లో డిమాండ్‌ ఉన్న బ్రాండ్స్‌లో మోటోరోలా ఒకటిగా ఉంది. గత సంవత్సరం మోటోరోలా ఎడ్జ్‌ 50 సిరీస్‌తోపాటు అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ సంవత్సరం ఎడ్జ్ 60 సిరీస్‌తోపాటు G సిరీస్‌ మోడళ్లు లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌ లో (Motorola Edge 60 Series) భాగంగా ఎడ్జ్‌ 60, ఎడ్జ్‌ 60 ప్రో, ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ మోడల్స్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు మోటోరోలా G56, G86 హ్యాండ్‌సెట్స్‌ కూడా విడుదల కానున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌లకు సంబంధించి కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి.

Motorola to launch edge 60 series

91మొబైల్స్‌ ఆధారంగా ఈ మోటోరోలా నుంచి త్వరలో లాంచ్‌ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో స్టోరేజీ వేరియంట్స్‌ సహా ధర, కలర్‌ వేరియంట్స్‌ వివరాలు ఉన్నాయి. అయితే విడుదల కానున్నాయనే వివరాలు వెల్లడి కాలేదు.

మోటోరోలా ఎడ్జ్‌ 60 స్మార్ట్‌ఫోన్‌ గ్రీన్‌, సీ బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 380 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.36,000) గా ఉండే అవకాశం ఉంది. ఎడ్జ్‌ 60 ఫ్యూజన్ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 350 (భారత్‌ కరెన్సీ ప్రకారం సుమారు రూ.33,100) గా ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్‌ 60 ప్రో మోడల్‌ (Motorola Edge 60 Pro) ధర EUR 600 (భారత్‌ కరెన్సీ ప్రకారం రూ.56,800) గా ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ 68W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. మరియు గ్రేప్‌, గ్రీన్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభించే అవకాశం ఉంది.

ఎడ్జ్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు G56 మోడల్‌ (Moto G56) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 250 (భారత కరెన్సీ ప్రకారం రూ.23,700) గా ఉండే అవకాశం ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్ ధర EUR 330 (భారత కరెన్సీ ప్రకారం రూ.31,200) గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై మోటోరోలా ఎటువంటి ప్రకటన చేయలేదు.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో :
భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ.27999, రూ.31999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS, స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. 50MP+ 13MP+ 10MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ 4500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 8GB ర్యామ్‌ వేరియంట్‌తో 68W ఛార్జింగ్‌ అడాప్టర్‌, 12GB ర్యామ్ వేరియంట్‌తో 125W ఛార్జింగ్‌ అడాప్టర్‌ను అందిస్తామని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola to launch edge 60 series and G series smartphones soon in india here are the leaked details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X