మోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లు

తన మోటో సిరీస్‌తో మార్కెట్లో కొత్త ఊపును తీసుకువచ్చిన మోటరోలా రెండు చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. మోటో సీ, మోటో సీ ప్లస్ మోడల్స్‌లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌లు రూ.6,000లోపు అందుబాటులో ఉంటాయని సమాచారం. ఇదే సమయంలో మోటో ఇ4, ఇ4 ప్లస్, మోటో జెడ్2 ఫోన్‌లపై కూడా మోటరోలా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

Read More : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లేటెస్ట్‌గా ధర తగ్గిన ఫోన్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాలుగు కలర్ వేరియంట్‌లలో...

వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు గోల్డ్, రెడ్, సిల్వర్ ఇంకా కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

5 అంగుళాల డిస్‌ప్లే

5 అంగుళాల డిస్‌ప్లేలతో వచ్చే ఈ హ్యాండ్‌సెట్‌లలో స్ర్కీన్ రిసల్యూషన్‌లు వేరువేరుగా ఉంటాయి. మోటో సీ మోడల్ 480 x 854పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీని కలిగి ఉంటే, మోటో సీ ప్లస్ మోడల్ 720 x 1280పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీని కలిగి ఉంటుంది.

3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో

మోటో సీ మోడల్ 3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సీ ప్లస్ మోడల్ కేవలం 4జీ మోడల్‌లో మాత్రమే దొరుకుతుంది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి...

3జీ వేరియంట్‌తో వచ్చే మోటో సీ మోడల్ 1.1GHZ 32బిట్ క్వాడ్ కోర్ మీడియాటెక్ చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 4జీ వేరియంట్‌తో వచ్చే మోటో సీ మోడల్ 1.3GHz 64బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి

మోటో సీ మోడల్ 8జీబి ఇంకా 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మోటో సీ ప్లస్ కేవలం 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ర్యామ్ విషయానికి వచ్చేసరికి..

మోటో సీ కేవలం 1జీబి ర్యామ్‌తో మాత్రమే దొరుకుతుంది. మోటో సీ ప్లస్ 1జీబి అలానే 2జీబి ర్యామ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

మోటో సీ మోడల్ 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుందని సమచారం. ఇదే సమయంలో మోటో సీ ప్లస్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి..

మోటో సీ 2350mAh బ్యాటరీ ప్యాక్ అయి ఉంటే, మోటో సీ ప్లస్ 4000mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. లెనోవో నేతృత్వంలోని మోటరోలా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను మే లేదా జూన్‌లో మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Motorola Upcoming Entry-Level Moto C and C Plus Leaked in Full. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot