మరో సంచలనం పై మోటరోలా దృష్టి...?

Posted By: Staff

మరో సంచలనం పై మోటరోలా దృష్టి...?

 

స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో మరో సంచలనానికి మోటరోలా తెరలేపనున్నట్లు సమాచారం. ఆపిల్ ఐఫోన్ 4ఎస్‌కు ధీటుగా ఓ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. డ్రాయిడ్ రాజర్ హెచ్‌డిగా రాబోతున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ పూర్తి స్దాయి హై‌డెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అత్యాధునిక ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేశారు. అమర్చిన 13 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో సమర్దవంతంగా తయారుకాబడిన ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను తొలిగా యూఎస్‌లో లాంఛ్ చేస్తున్నట్లు సమాచారం. మేలో జరిగే ఈ ఆవిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ఫీచర్లు:

* 3.5 అంగుళాల LED బ్యాక్‌లైట్ టీఎఫ్టీ డిస్‌ప్లే, * iOS ఆపరేటింగ్ సిస్టం, * 1 GHz కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, * * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్, * బ్లూటూత్, * జీపీఎస్, * యూఎస్బీ కనెక్టువిటీ, * వై-ఫై 802.11, హాట్ స్పాట్, * రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, * ఫ్రంట్ వీజీఏ, వీడియో కాలింగ్, * ఆడియో, వీడియో ప్లేయర్, * గేమ్స్, * 16జీబి ఇంటర్నల్ మెమరీ (32,64 వేరింయంట్ లలో లభ్యం), * ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ, * బ్యాటరీ స్టాండ్‌బై 200 గంటలు, * టాక్‌టైమ్ 2జీ 14 గంటలు, 3జీ 8 గంటలు, * బ్రౌజర్ హెచ్టీఎమ్ఎల్, సఫారీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting