మోటరోలా మరో ముందడుగు..!!!

By Super
|
Motorola XT 531
కాలంతో పాటు మనం కూడా మారాలండి.. తప్పదు..!!, టెక్నాలజీతో పరుగులెడుతున్నరోజులివి, రోజుకో వింత అనుభవం మనను ఆశ్చర్యచకితులను చేస్తుంది. smart phoneల గురించి మీకు తెలిసే ఉంటుంది.. అయితే వీటిలో ఇప్పటి వరకు single sim smart phoneలనే మీరు చూసుంటారు. పలు చిన్నకంపెనీలు ఇప్పటికే dual SIM enabled handsetలను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికి వినియోగదారులను ఆకర్షించటంలో మాత్రం విఫలమయ్యాయి.

మొబైల్ రంగంలో ప్రపంచలోనే అత్యుత్తమ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న ‘Motorola’ మరో వినూత్నప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ‘Motorola XT531’ పేరుతో సరికొత్త ‘dual SIM handset’ను విడుదల చేసింది. android 2.3, Gingerbread operating systemతో రూపుదిద్దుకున్న ఈ డబల్ ఫ్యూచర్ స్మార్ట్ ఫోన్ 3.2 అంగుళాల ‘touch screen’ స్వభావం కలిగి ఉంది.

ఆకట్టకునే రూపురేఖలతో ఈ మెబైల్‌ను రూపొందిచారు. 11.95 mm దారుఢ్యం కలిగిన ‘Motorola XT531’ కేవలం 114 గ్రాముల బరవు మాత్రమే ఉంటుంది. ఈ మెబైల్‌కు అమర్చిన 5 మోగా పిక్సల్ కెమెరా నాణ్యమైన ఫోటోలను మీకు అందిస్తుంది. అంతేకాదండోయ్..!! ఈ మెబైల్‌లో పొందుపరిచిన ‘video recording’ ఆప్షన్ మీకు నచ్చిన మధుర జ్ఞాపకాలను సహజసిద్ధమైన అనూభూతి కలిగించే విధంగా చిత్రీకరిస్తుంది. ఇక మెబైల్‌కు అమర్చిన ఫ్రెంట్ కెమెరా మరో ప్రత్యేకత.

మీకు కావల్సినంత ‘memory’ని ఈ స్మార్ట్ మెబైల్‌లో దాచుకోవచ్చు.. ఎందుకుంటే దీని సామర్ధ్యం 32 GB కాబట్టి. ఇక connectivity విషయానికి వస్తే ‘Motorola XT 531’లో పొందుపరిచిన Wi-Fi, Bluetooth, మరియు 3G అంశాలు తక్కువ వ్యవధిలో మీ పనిని చక్కబెడతాయి.

ఈ స్మార్ట్ పీస్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ ‘lithium Ion 1540 mAh battery’.. ఫుల్ ఛార్జింగ్‌తో మీరు నిరంతరంగా 8 గంటల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ బ్యాటరీ stand by time ఎంతో తెలుసా.. 28 రోజులు. మరే ఇతర స్మార్ట్ మెబైల్ లో లేని అంశాలు మీకు ‘Motorola XT 531’లో దర్శనమిస్తాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్రవేసిన ‘మోటరోలా బ్రాండ్’ ‘Motorola XT 531’ను కేవలం రూ.12,000కు మీకు అందిస్తుంది. ఇంకెందుకండి ఆలస్యం త్వరపడండి మరీ..!!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X