మొజిల్లా నుంచి ప్రపంచపు చవక ధర ఫోన్... త్వరలో!

Posted By:

ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ప్రపంచపు అత్యంత చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను ఈ జూలైలోనే ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు మొజిల్లా తైవాన్ సీఈఓ అలానే సీఓఓ గోంగ్ లీ ధృవీకరించారంటూ డిగీటైమ్స్ ఓ నివేదికలో పేర్కొంది.

మొజిల్లా నుంచి ప్రపంచపు చవక ధర ఫోన్... త్వరలో!

భారత్‌లో వ్యాపారం సాగించేందుకు మొజిల్లా క్రిందటి నెలలోనే ఇంటెక్స్, స్పైస్ వంటి దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ప్రపంచపు అత్యంత చవక ధర మొజిల్లా స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.3000 లోపు ఉండొచ్చని ఓ అంచనా.

2014 , మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా మొజిల్లా, ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించిన విషయం తెలిసిందేదే. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే యూరోప్ ఇంకా లాటిన్ అమెరికా దేశాల్లో లభ్యమవుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot