ఉచిత రోమింగ్ ప్లాన్‌లను ఆవిష్కరించనున్న ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్

Posted By:

ఉచిత రోమింగ్ ప్లాన్‌లను ఆవిష్కరించనున్న ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్

ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్‌లు ఈ నెల 26 నుంచి సరికొత్త రోమింగ్ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆయా టెలికాం కంపెనీలు వినియోగదారులకు ఉచిత కాల్స్ అందే అవకాశాలు ఉన్నాయి.

ప్రవేశపెట్టబోయే తాజా రోమింగ్ పథకాల్లో భాగంగా ఎంటీఎన్ఎల్.. డిల్లీ, ముంబై ప్రాంతాల్లోని తమ వినియోగదారుల నుంచి ఎటువంటి రోమింగ్ ఛార్జింగ్‌లను వసూలు చేయకుండా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించే ప్రణాళికల్లో ఉన్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

మరో వైపు బీఎస్ఎన్ఎల్ కూడా ఉచిత కాల్స్‌తో కూడిన రోమింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉందని, అయితే ఈ సర్వీసును పొందగోరే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రోజుకు ఒక రూపాయి చెల్లించుకోవల్సి ఉంటుందని సదరు అధికారి తెలిపారు.

ఈ ఉచిత రోమింగ్ ప్లాన్‌లు జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకాలను కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశముందని అధికారి తెలిపారు.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot