భారత్ కు చెందిన ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఎంటీఎస్ తన బ్లేజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో సరికొత్త డ్యుయల్ కాలింగ్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంటీఎస్ బ్లేజ్ 4.5 పేరుతో రూపకల్పన చేయబడిన ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.9,999. ప్రముఖ రిటైలర్ thinkofus.in 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ తో ఈ డివైస్ ను విక్రయిస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే......... #13; #13;డ్యుయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),4.5 అంగుళాల టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఎస్),1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. #13;మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. #13;వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. #13;