మార్కెట్లోకి ఎంటీఎస్ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By: Super

మార్కెట్లోకి ఎంటీఎస్ స్మార్ట్‌ఫోన్‌లు!

ఎంటీఎస్ పేరుతో సీడీఎమ్ఏ సేవలందిస్తున్న సిస్టమా శ్యామ్ టెలీ సర్వీసెస్(ఎస్ఎస్‌టీఎల్) మూడు ఆండ్రాయిడ్ ఆధారత స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం ఆవిష్కరించింది. ఎంటాగ్ 281, ఎంటాగ్ 352,ఎంటాగ్ 351 మోడళ్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకమైన లైవ్‌టీవీ అప్లికేషన్‌ను ఒదిగి ఉన్నాయి. ఈ ప్రత్యేకతతో 100 లైవ్‌టీవీ చానళ్లను వీక్షించవచ్చు. ఈ మూడింటితో కలిపి స్మార్ట్‌ఫోన్ విభాగంలో 8 రకాల స్మార్ట్‌ఫోన్‌లను ఎంటీఎస్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ల కొనుగోలు పై అందించే హైస్పీడ్ డేటా పథకాలతో పాటు మూడు నెలల పాటు ఎంటీఎస్ లోకల్ నెంబర్ల మధ్య అపరిమిత కాల్స్ నిర్వహించుకోవచ్చు.

ఎంటీఎస్ ఎంటాగ్ 351(MTS MTag 351):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమెరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.7,499.

ఎంటీఎస్ ఎంటాగ్ 352 (MTS MTag 352):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3 మెగా పిక్సల్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.6,499.

ఎంటీఎస్ ఎంటాగ్ 281(MTS MTag 281):

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

3 మెగా పిక్సల్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, ధర రూ.5,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot