ఎంటీఎస్ నయా అవతార్!

Posted By: Super

ఎంటీఎస్ నయా  అవతార్!

 

సీడీఎమ్ఏ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎంటీఎస్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎంటీఎస్ ఎమ్ టాగ్ 410 మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్ ధర రూ.8,999. ఈ ఫోన్ కొనుగోలు పై వినియోగదారులు మూడు నెలల పాటు ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్‌కు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఫోన్ ఇతర ఫీచర్లు:

- 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 899మెగాహెడ్జ్),

- 3 మెగా పిక్సల్ కెమెరా,

- 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

- మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు,

- టీవీ అప్లికేషన్ (100 ఛానల్స్ ను ప్రత్యక్షంగా వీక్షించే సౌలభ్యత),

- గుగూల్ ప్లే స్టోర్.

టాబ్లెట్ పీసీపై దృష్టి:

ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆధారితంగా పనిచేసే టాబ్లెట్ కంప్యూటర్ ను త్వరలోనే విడుదల చేసేందకు ఎంటీఎస్ సన్నాహాలు చేస్తుంది. స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాలు. ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఆవిష్కరణల పై ఎంటీఎస్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ వినియోగదారులకు ఉత్తమ స్వర్వీస్ ను అందించేందకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తో తమ నుంచి మరిన్ని ఆవిష్కరణలు ఉంటాయని స్ఫష్టం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot