100జీబి డేటాతో ఎంటీఎస్ బ్లేజ్ 5.0@రూ.10,999

Posted By:

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎంటీఎస్ (MTS) ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం బ్లేజ్ 5.0 (Blaze 5.0) పేరుతో సిరకొత్త డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.10,999. ఈ ఫోన్ కొనుగోలు పై 100జీబి ఉచిత డేటాను ఎంటీఎస్ ఆఫర్ చేయటం విశేషం. ఈ ఉచిత డేటా ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోదలచిన వారు అదనంగా రూ.198 చెల్లించవల్సి ఉంటుంది. ఎంటీఎస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ (పశ్చిమ), పశ్చిమ బెంగాల్, కోల్ కతా సర్కిళ్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. ఎంటీఎస్ బ్లేట్ 5.0 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

ఈ ఫోన్ కొంటే 100జీబి డేటా ఉచితం!

5 అంగుళాల తాకేతెర,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ఫోన్ ఇంటర్నల్ మెమరీకి సంబంధించి సమాచారం లేదు,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవవాశం,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9.5 గంటల టాక్‌టైమ్‌తో).

ఎంటీఎస్ ప్లేగ్రౌండ్ మ్యూజిక్, ఎంటీఎస్ టీవీ, ఎంటీఎస్ విజర్డ్ వంటి అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో లోడ్ చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot