5 వేలకే ఎంటిఎస్‌ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్...

By Super
|
MTS
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ హావా కొనసాగుతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మొబైల్స్‌ని విడుదల చేసే తయారీదారులు కాడా బాగా పెరిగిపోయారు. ఈ తయారీ దారులలోకి కొత్తగా ఇప్పుడు ఎంటిఎస్‌ చేరింది. యూజర్స్ యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఎంటిఎస్‌ కొత్తగా మార్కెట్లోకి రెండు ఆండ్రాయిడ్ బడ్జెట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. ఎంటిఎస్‌ విడుదల చేయనున్న రెండు మొబైల్స్ కూడా ఒకే విధమైన ఫీచర్స్‌ని కలిగి ఉండనున్నాయి.

రెండింటిలో ఒక మొబైల్ బ్లాక్ ఫినిషింగ్‌తో రాగా, రెండవ మొబైల్ సిల్వర్ మెటాలిక్ ఫినిషింగ్‌తో చూడడానికి అందంగా స్నాప్ డ్రాగన్ ఎస్1 ప్రాసెసర్‌తో రూపొందించడం జరిగింది. ఎంటిఎస్‌ విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్ పేర్లు వరుసగా ఎంటిఎస్‌ ఎ ట్యాగ్‌ 3.1, ఎంటిఎస్‌ లైవ్‌వైర్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లో మంచి ఫెర్పామెన్స్‌ని ప్రదర్శించడంతో పాటు, తక్కువ ధరలో కూడా లభ్యమవుతున్నాయి.

ఎంటిఎస్‌ బ్రాండ్‌ పేరుతో టెలికం సేవలందిస్తున్న సిస్టెమా శ్యామ్‌ టెలీసర్వీసెస్‌ లిమిటెడ్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భాతర మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంటిఎస్‌ ఎ ట్యాగ్‌ 3.1, ఎంటిఎస్‌ లైవ్‌వైర్‌ పేరిట ఇది 5 వేల రూపాయల కన్నా తక్కువ ధరకు లభ్యమవుతాయనిక్వాల్‌కాం మొబైల్‌ ప్రాసెసర్లపై వీటిని తయారు చేశామని సంస్థ చీఫ్‌ వెస్వలోడ్‌ రొజానోవ్‌ వివరించారు. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో చౌకైనవి ఇవేనని ఆయన అన్నారు. ఎంట్యాగ్‌ 3.1లో 3.2 ఎంపి కెమెరా, ఆడియో, విడియో ప్లేయర్‌, జి మెయిల్‌, యు ట్యూబ్‌, జి టాక్‌, మ్యాప్స్‌ యాక్సెస్‌ సదుపాయాలున్నాయని, వాయిస్‌ సెర్చ్‌ అదనపు ఆకర్షణగా ఆయన పేర్కొన్నారు.

దీన్ని హ్యూయ్‌ తయారు చేసిందని వివరించారు. లైవ్‌వైర్‌ మోడల్‌ను జడ్‌టిఇ అందించిందని సిడిఎంఎ ఇవి-డిఒ నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ ఫోన్‌ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వాడకానికి అనువైనదని తెలిపారు. వైవ్‌ టివి, ఆన్‌ డిమాండ్‌ విడియో ప్లేబ్యాక్‌ సదుపాయాలున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూయ్‌ ఇండియా సిఇఒ మాక్స్‌ యంగ్‌, జడ్‌టిఇ ఇండియా చీఫ్‌ కుయ్‌ లియాంగ్‌జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X