చౌకబారు ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలంటే ఇన్ని కండిషన్సా...!!

Posted By: Super

చౌకబారు ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలంటే ఇన్ని కండిషన్సా...!!

ఎమ్‌టిఎస్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి రూ 4,000లోపు ఖరీదు కలిగిన ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేయనున్నమని ప్రకటించింది. ఏంటీ రూ 4,000లకు ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్ ఏంటని షాక్ అయ్యారా...? ఇంకా మున్ముందు నేను చెప్పేది వింటే ఇంకా షాక్‌కి గురి అవ్వుతారు. ఎమ్‌టిఎస్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎమ్‌టిఎస్ గురించి చెప్పాలంటే ఇండియాలో సిడిఎమ్‌ఎ ఆపరేటర్‌గా ప్రస్దానాన్ని మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే ఇండియన్ మొబైల్ మార్కెట్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న మొబైల్ ఆపరేటర్.

ఎమ్‌టిఎస్ విడుదల చేయనున్న రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా లాక్ సిస్టమ్‌ని కలిగి ఉండడం విశేషం. లాక్ సిస్టమ్ అంటే ఒక నెట్ వర్క్‌కి సంబంధఇంచిన సిమ్‌ని మాత్రమే యూజర్స్ వాడవల్సి ఉంటుంది. వేరే నెట్ వర్క్‌కి చెందిన సిమ్‌లను యూజర్స్ అందులో వాడడం కష్టం. ఎమ్‌టిఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఈ రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా సిడిఎమ్‌ఎ విభాగంలో విడుదల చేయనుంది. ఇకపోతే ఈ రెండు హ్యాండ్ సెట్స్ లలో రెండు సిమ్‌ల(పోస్ట్ పెయిడ్, ఫ్రీ పెయిడ్)లకు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎమ్‌టిఎస్ ఎంతో ప్రతిష్టాత్మంకంగా విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్ పేర్లు ఎమ్‌టిఎస్ లివ్‌వైర్, ఎమ్‌టిఎస్ ఎమ్ టాగ్ 3.

ముందు చెప్పినట్లు ప్రీపెయిడ్ ఆఫ్షన్స్‌తో రెండు మొబైల్స్‌ని ఉపయోగించుకొవాలంటే యూజర్ ఎమ్‌టిఎస్ లివ్‌వైర్‌కు రూ 4,999, అదే ఎమ్‌టిఎస్ ఎమ్ టాగ్ 3కు రూ 5,499 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇక పోస్ట్ పెయిడ్ ఆఫ్షన్స్ విషయానికి వస్తే యూజర్స్ ఎమ్‌టిఎస్ లివ్‌వైర్‌కు రూ 2,999, అదే ఎమ్ టాగ్ 3కు రూ 3,499 చెల్లించాల్సి ఉంటుందని ఎమ్‌టిఎస్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదండోయ్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ కేవలం 12 నెలలు వరకే ఉంటుంది.

ఇక పోస్ట్ పెయిడ్ యూజర్స్ మాత్రం ఈ ఎమ్‌టిఎస్ ఆండ్రాయిడ్ మొబైల్‌ని కొనుగొలు చేస్తే నెలకు 250 MB డేటా, 250 నిమిషాలు, 250 ఎస్‌ఎమ్‌ఎస్ ఫ్రీగా లభించనున్నాయి. ఇందుకు గాను యూజర్ 12 నెలలకు రూ 250 చొప్పున నెలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఎమ్‌టిఎస్ లివ్ వైర్ ఆడ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో హై రిజల్యూషన్ ఇమేజిలను తీయవచ్చు. ఇక ఈస్మార్ట ఫోన్‌ని మార్కెట్లోకి జడ్‌టిఈ ప్రమోట్ చేస్తుంది.

ఇక రెండవ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎమ్‌టిఎస్ ఎమ్ టాగ్3 మొబైల్‌ని మార్కెట్లోకి హువాయ్ కంపెనీ ప్రమోట్ చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్కీన్ సైజు 2.8 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. ఇందులో ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చూడచక్కని ఇమేజిలను తీయవచ్చు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఎమ్‌టిఎస్ టివి అప్లికేషన్ ప్రత్యేకం.

ఎమ్‌టిఎస్ రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్ ధరలు రూ 10,000 మించి ఉండడం మనం గమనిస్తున్నాం. ఎమ్‌టిఎస్ ఇలా ఒక్కసారిగా రూ 4,000లోపే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడంతో వాటి భవితవ్యం ఏంటని త్వరలోనే తెలుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot