కొత్త కస్టమర్‌లకు ఎంటీఎస్ ఉచిత టాక్‌టైమ్ ఆఫర్లు

ఎంటీఎస్ బ్రాండ్ పేరుతో భారత్‌లో టెలికామ్ సేవలందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (ఎస్ఎస్‌టీఎల్) కొత్త కస్టమర్‌లను ఆకర్షించే క్రమంలో ‘ఆఫర్ క సికందర్'('Offer Ka Sikander) పేరుతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ పథకంలో భాగంగా ఎంటీఎస్ వాయిస్ కాలింగ్ నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే నూతన వినియోగదారులు ఎంటీఎస్ కొత్త సిమ్‌తో రూ.40 వరకు ఉచిత టాక్‌టైమ్‌ను పొందుతారు. అలానే రూ.30, రూ.149 రీచార్జ్‌ల పై పూర్తి టాక్‌టైమ్‌ను ఆస్వాదిస్తారు.
అలానే రూ.150 పై చిలుకు రిచార్జ్‌ల పై 10 శాతం అదనపు టాక్‌టైమ్‌ను ఈ పథకంలో భాగంగా వినియోగదారులు పొందవచ్చు. 6 నెలల యాక్టివేషన్ పై ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఈ స్కీమ్ రాజస్థాన్, కేరళా, కర్ణాటక, తమిళనాడు, కోల్‌కతా ఇంకా పశ్చిమ బెంగాల్‌లోని పలు సర్కిళ్లలో అందుబాటులో ఉంది. దేశ వ్యాప్తంగా త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుక ఎంటీఎస్ కసరత్తులు చేస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications