ఎంటీఎస్ నుంచి చౌక ధర సీడీఎమ్ఏ ఫోన్!

Posted By:

ప్రముఖ సీడీఎమ్ఏ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఎంటీఎస్, లావా మొబైల్స్‌తో సంయుక్త ఒప్పందాన్ని కుదుర్చుకుని చౌకధర శ్రేణిలో సీడీఎమ్ఏ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సీడీఎమ్ఏ ఫోన్ మోడల్ పేరు ‘లావా ఎల్661'. ధర రూ. 1199.

లావా ఎల్661, 1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబికి విస్తరించుకోవచ్చు. స్పీకర్ ఫోన్, ఆలారమ్, క్యాలెండర్, వీ కార్డ్, గ్రూప్ ఎస్ఎంఎస్, షెడ్యూలర్ ఎంటీఎస్ ఇన్ఫో వంటి ఫీచర్లు ఈ తక్కువ ధర హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఎంటీఎస్ నుంచి చౌక ధర సీడీఎమ్ఏ ఫోన్!

లావా ఎల్661 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

సీడీఎమ్ఏ 800మెగాహెట్జ్ నెట్‌వర్క్,
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎంపీ3 ప్లేయర్, కాల్ మేనేజిమెంట్, 3 వే కాన్ఫిరెన్స్ కాల్, గేమ్స్, క్యాలుక్యులేటర్, గ్రూప్ ఎస్ఎంఎస్, క్యాలెండర్,
ఇతర ఫీచర్లు: ఆలారమ్, క్యాలెండర్, వీ కార్డ్, గ్రూప్ ఎస్ఎంఎస్, షెడ్యూలర్ ఎంటీఎస్ ఇన్ఫో.

లావా ఎల్661 బ్లాక్, వైట్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ధర రూ.1199.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot