ఇండస్ట్రీకి కొత్త... (ఓ చూపు చూస్తారా)!

Posted By: Super

ఇండస్ట్రీకి కొత్త... (ఓ చూపు చూస్తారా)!

ప్రముఖ సీడీఎమ్ఏ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎంటీఎస్, తాజాగా ఆండ్రాయిడ్ ఆధారిత సీడీఎమ్ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. విశిష్టమైన ప్రత్యేకతలతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ పేరు ఎమ్‌ట్యాగ్ 401, ఈ ఫోన్ కొనుగోలు పై ఆకర్షణీయమైన అపరిమిత డేటా యూసేజ్ ఆఫర్‌లను ఎంటీఎస్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో ఎంటీఎస్ అవుట్‌లెట్‌లలో లభ్యంకానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులను ఆకట్టుకోగల నైపుణ్యాలను కలిగి ఉందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

3 మెగా పిక్సల్ కెమెరా,

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్(సామర్ధ్యం 800మెగాహెట్జ్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

లైవ్ టీవీ అప్లికేషన్ (100 ఛానళ్లను వీక్షించే సౌలభ్యత),

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

మన్నికైన బ్యాకప్ నిచ్చే 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర అంచనా రూ.9000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot