ఎంటీఎస్ క్రిస్మస్ ఆఫర్.. ఫోన్ కొంటే బ్లూటూత్ హెడ్‌సెట్ ఉచితం

Posted By: Prashanth

ఎంటీఎస్ క్రిస్మస్ ఆఫర్.. ఫోన్ కొంటే బ్లూటూత్ హెడ్‌సెట్ ఉచితం

 

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) క్రిస్మస్ సంబరాలను పురస్కరించుకుని ఎంటీఎస్ మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై ఉచిత బహుమతులను అందిస్తుంది. ఈ ప్రత్యేక ఆన్‌లైన్ ఆఫర్‌లో భాగంగా ఎంటీఎస్ ఎంట్యాగ్ 351, ఎంటీఎస్ ఎంట్యాగ్ 352, ఎంటీఎస్ ఎంట్యాగ్ 353, ఎంటీఎస్ ఎంట్యాగ్ 401 ఫోన్‌ల కొనుగోలు పై రూ.100 విలువ చేసే బ్లూటూత్ హెడ్‌సెట్ ఇంకా 2జీబి మెమరీ కార్డ్‌లను ఉచితంగా పొందవచ్చు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌లు టచ్‌స్ర్కీన్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసకుని మీరూ ఓ ఎంటీఎస్ ఫోన్‌ను సొంతం చేసుకోండి మరి!

స్వామి నిత్యానంద వెబ్‌సైట్‌లో ఏమున్నాయ్..?

ఎంటీఎస్ ఎంటాగ్ 351(MTS MTag 351):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమెరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ.

ఎంటీఎస్ ఎంటాగ్ 352 (MTS MTag 352):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3 మెగా పిక్సల్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ.

పైసా ఖర్చు లేకుండా ‘సిక్స్ ప్యాక్’..!

ఎంటీఎస్ ఎంట్యాగ్ 353 (MTS MTag 353):

3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్ HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 800మెగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 150ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 b/g/n, మొబైల్ హాట్‌స్పాట్, ఏ-జీపీఎస్), 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 150 గంటల స్టాండ్‌బై). ఎంటీఎస్ టీవీ అప్లికేషన్ (100 లైవ్ చానళ్లను వీక్షించే సందుపాయం).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot