ఎంటీఎస్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఎంట్యాగ్ 353’

Posted By: Prashanth

ఎంటీఎస్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఎంట్యాగ్ 353’

 

ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎంటీఎస్ ‘ఎంట్యాగ్ 353’(MTag 353) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్‌ను కలిగి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుందని ఎంటీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఇంకా సేల్స్ అధికారి లియోనిడ్ ముసాటోవ్ అన్నారు. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ పై ఎంటీఎస్ హైస్పీడ్ డేటా‌ప్లాన్‌లతో పాటు వాయిస్ ప్లాన్‌లను అందిస్తుంది.

ఎంట్యాగ్ 353 కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్ HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

800మెగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

150ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 b/g/n, మొబైల్ హాట్‌స్పాట్, ఏ-జీపీఎస్),

1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 150 గంటల స్టాండ్‌బై).

ఎంటీఎస్ టీవీ అప్లికేషన్ (100 లైవ్ చానళ్లను వీక్షించే సందుపాయం).

డేటా ప్లాన్స్:

రెండు నెలల పాటు 512ఎంబీ డేటా, మూడు నెలల పాటు 500 లోకల్ + ఎస్టీడీ నిమిషాలు, 6 నెలల పాటు లోకల్ + ఎస్టీడీ కాల్స్ పై రెండు సెకన్లకు ఒక పైసా.

ధర ఇతర వివరాలు:

దేశీయ మార్కెట్లో ‘ఎంటీఎస్ ఎంట్యాగ్ 353’ ధర రూ.5,999. అన్ని ప్రముఖ షాపింగ్ సైట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot