మంచులో టచ్ స్ర్కీన్ మొబైల్‌ను ఆపరేట్ చేయ్యాలంటే..?

Posted By: Prashanth

మంచులో టచ్ స్ర్కీన్ మొబైల్‌ను ఆపరేట్ చేయ్యాలంటే..?

 

అది చలి కాలం.. విపరీతంగా మంచు కురుస్తున్న రోజులవి.. అనుకోకుండా ఆ మంచు వాతావరణంలో మీరు బయటకు వెళ్లాల్సివచ్చింది, రెగ్యులర్‌గా ధరంచే స్వెట్టర్, చేతి తొడుగులు (గ్లవ్స్) వేసుకుని బయటకు వచ్చేశారు. ఇంతలోనే మీ ఫోన్ మోగింది. కాల్ పిక్ చెయ్యాలి.. టచ్ ఆధారితంగా పనిచేసే మీ మొబైల్ చేతి స్పర్శకు మాత్రమే స్పందిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు గత్యంతరం లేక చేతి తొడుగును తీసి కాల్ ఆన్సర్ చేస్తారు.

ఈ సమస్యకు చెక్ పెడుతూ ముజ్జో ( Mujjo) విదేశి సంస్థ టచ్ స్ర్కీన్ ఫోన్లకు స్పందించే విధంగా చేతి తొడుగులు (గ్లవ్స్)ను డిజైన్ చేసింది. ఈ గ్లవ్‌లను ధరించి చలి వాతావరణంలో నిశ్చితంగా టచ్ ఆధారిత గ్యాడ్జెట్లను సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు. టచ్ స్ర్కీన్‌‌కు స్పందించే హై క్వాలిటీ సిల్వర్ కోటెడ్ నైలాన్ ఫైబర్ పదార్థాన్ని గ్లవ్స్ నిర్మాణంలో వినియోగించారు. ముజ్జో టచ్ స్ర్కీన్ వింటర్ గ్లవ్‌ను €24.95 చెల్లించి. ముజ్జో ఆన్ లైన్ స్టోర్ల ద్వారా పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot